Muttiah Muralitharan : ‘నా రికార్డు సేఫ్.. ఎవ్వరూ టచ్ చేయలేరు..’ ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ కొనసాగుతున్నాడు.

Muttiah Muralitharan Says No One Will Break His Test Wickets Record
Muralitharan : టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ కొనసాగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఆఫ్ స్పిన్నర్ 800 వికెట్లు తీశాడు. తన రికార్డును ఏ బౌలర్ కూడా బ్రేక్ చేసే అవకాశం లేదని అంటున్నాడు. అదే సమయంలో టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం అందరూ టీ20 క్రికెట్ పైనే దృష్టి పెడుతున్నారని అన్నాడు. అందువల్ల తన రికార్డుకు వచ్చిన నష్టం ఏమీ లేదని, దాని దరిదాపుల్లోకి ఎవరూ రారని అన్నారు. చాలా దేశాల్లో టెస్టు క్రికెట్ చూసే వారి సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో మ్యాచుల సంఖ్య తగ్గిపోతుందన్నాడు. ఏడాదిలో ఒక్కొ దేశం ఆరు లేదా ఏడు టెస్టులు మాత్రమే ఆడుతోందన్నాడు.
AFG vs NZ : ‘ఇదేం గ్రౌండ్ రా బాబు.. ఇంత చెత్తగా ఉంది.. ఇంకొసారి..’ అఫ్గానిస్థాన్ రుసరుసలు
తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఆటగాళ్ల కెరీర్ 20 ఏళ్ల పాటు ఉండేదని, ఇప్పటి ఆటగాళ్ల కెరీర్ చాలా స్వల్పంగా ఉంటుందన్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 800 వికెట్ల రికార్డును మరొకరు అధిగమించాలంటే చాలా కష్టం అని ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే.. ముత్తయ్య మురళీధరన్ రికార్డుకు ప్రస్తుతం దరిదాపుల్లో ఎవరూ లేరు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (530 వికెట్లు), భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (516) లు మాత్రమే ఐదువందల వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. అయితే.. లియోన్ వయసు 36 కాగా అశ్విన్ 37. వారిద్దరు రిటైర్‌మెంట్‌కు దగ్గరిలో ఉన్నారు. వారు మురళీధరన్ రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం. 30 ఏళ్ల లోపు బౌలర్లలో దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడ 299 వికెట్లతో ఉన్నాడు.
Yograj Singh : అర్జున్ టెండూల్కర్ కెరీర్‌పై యువీ తండ్రి యోగరాజ్ సింగ్ కామెంట్స్.. బొగ్గు గనిలో..
అయితే.. ఫాస్ట్ బౌలర్ అయిన కగిసో గాయాల పాలు కాకుండా నిలకడగా ఎన్నాళ్ల పాటు మ్యాచులు ఆడతాడో అన్నది చెప్పడం కష్టం. అదే సమయంలో టీ20 క్రికెట్‌తో పాటు ప్రాంఛైజీ క్రికెట్ ఆడుతుండడంతో ఆటగాళ్లు కెరీర్‌ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నారు.