రింకూ సింగ్ బంపర్ ఆఫర్.. యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫినిషర్ పంట పండింది పో..!
టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు (Rinku Singh) ప్రభుత్వ ఉద్యోగం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 24, 2026 / 01:16 PM IST
Rinku Singh set to be appointed as a regional sports officer in UP
Rinku Singh : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఫినిషర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అతడిని రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడి అద్భుతమైన ప్రతిభతో పాటు అంకితభావానికి గుర్తింపుగానే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సదరు వార్తల సారాంశం.
టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న సమయంలో రింకూ సింగ్ తండ్రి మరణించారు. అతడి తండ్రి అంత్యక్రియలు పూర్తైన వెంటనే రింకూ సింగ్ జట్టుతో చేరిన సంగతి తెలిసిందే.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు బహుమతులు అందించే పథకాన్ని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ను సన్మానించడంతో పాటు అతడికి ఉద్యోగ నియామకపత్రాన్ని అందించనున్నారు.
భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు రాజ్‌కుమార్ పాల్ కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమితులవనున్నారు. అలాగే పారాలింపిక్ హై జంప్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ కు కూడా డీఎస్పీ పదవి ఇవ్వనున్నారు. పారాలింపిక్ జావెలిన్ త్రో రజత పతక విజేత అజిత్ సింగ్ (ఎటావా), పారాలింపిక్ 200 మీటర్ల కాంస్య పతక విజేత సిమ్రాన్ (ఘజియాబాద్) లకు జిల్లా పంచాయత్ రాజ్ అధికారులుగా నియమితులు కానున్నారు.
BCCI : ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కొత్త రూల్స్.. జబ్బలు కనపడ్డాయో..
లోక్ భవన్‌లో జరిగే సన్మాన కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ అథ్లెట్లకు నియామక పత్రాలను అందజేయనున్నారు.
