కుర్రాళ్లు సత్తా చాటుకోవడానికి ఈ లీగ్ గొప్ప అవకాశం: రిషభ్ పంత్

చాలా ఉత్సాహంగా ఆడుతున్నానని చెప్పాడు. ఐపీఎల్లో గుర్తింపు పొందని..

Rishabh Pant

క్రికెట్లో కుర్రాళ్లు తమ సత్తాను చాటుకోవడానికి ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌) ఓ గొప్ప అవకాశమని భారత క్రికెటర్ రిషభ్ పంత్ అన్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. మెన్స్ జట్లు 6, మహిళల జట్లు 6 ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. డీపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లలో రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ఆయుష్ బడోని, అనూజ్ రావత్, హర్షిత్ రాణా వంటి వారు కూడా ఉన్నారు.

పురాణి డిల్లీ 6 తరఫున రిషభ్ పంత్ ఆడుతున్నాడు. ఇవాళ పురాణి ఢిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో చాలా ఉత్సాహంగా ఆడుతున్నానని చెప్పాడు. ఐపీఎల్లో గుర్తింపు పొందని ఆటగాళ్లకు గ్రౌండ్ లెవల్‌లో డీపీఎల్ ఓ పెద్ద అవకాశమని అన్నాడు. ఈ టోర్నీలో యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని చెప్పాడు.

కాగా, పురాణి ఢిల్లీ 6 యజమాని ఆకాశ్ నంగియా మాట్లాడుతూ… ఇటువంటి అద్భుతమైన లైనప్‌తో డీపీఎల్‌ను ప్రారంభించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నామని చెప్పారు. తమ వైపు ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్ ఉండటం తమ యువ ఆటగాళ్లను స్ఫూర్తినిస్తుందని తెలిపారు. తమ పురాణీ ఢిల్లీ 6 జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Also Read: వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం.. కన్నీరు పెట్టుకున్న రెజ్లర్.. ఓదార్చిన కాంగ్రెస్ ఎంపీ, సన్నిహితులు

ట్రెండింగ్ వార్తలు