Rishabh Pant : రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌.. మూడో భార‌త వికెట్ కీప‌ర్‌గా..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ (Rishabh Pant) అరుదైన ఘ‌నత సాధించాడు.

Rishabh Pant Becomes 3rd Indian Wicketkeeper to play 50 or more matchs in tests

  • రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌
  • టీమ్ఇండియా త‌రుపున 50 టెస్టులు పూర్తి చేసుకున్న మూడో వికెట్ కీప‌ర్‌గా
  • అఫ్గాన్‌తో మ్యాచ్ పంత్ కెరీర్‌లో 50వ టెస్టు

Rishabh Pant : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌నత సాధించాడు. టీమ్ఇండియా త‌రుపున 50 లేదా అంత‌కంటే ఎక్కువ టెస్టుల్లో ప్రాతినిధ్యం వ‌హించిన వికెట్ల కీప‌ర్ల జాబితాలో చేరాడు. శ‌నివారం ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో ప్రారంభ‌మైన ఏకైక టెస్టు మ్యాచ్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్ పంత్ టెస్టు కెరీర్‌లో 50వ మ్యాచ్.

భార‌త టెస్టు చ‌రిత్ర‌లో 50 లేదా అంత‌కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీప‌ర్ల జాబితాలో పంత్ మూడో స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోని, స‌య్య‌ద్ కిర్మానీలు మాత్ర‌మే 50 కంటే ఎక్కువ టెస్టులు ఆడారు.

R Praggnanandhaa : చ‌రిత్ర సృష్టించిన‌ ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు..

అత్య‌ధిక టెస్టులు ఆడిన భార‌త వికెట్లు కీప‌ర్లు వీరే..

* ఎంఎస్ ధోని – 90 టెస్టులు (2005 నుంచి 2014 వ‌ర‌కు)
* స‌య్య‌ద్ కిర్మాని – 88 టెస్టులు (1976 నుంచి 1986 వ‌ర‌కు)
* రిష‌బ్ పంత్ – 50* టెస్టులు (2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు)
* కిర‌ణ్ మోరే – 49 టెస్టులు (1986 నుంచి 1993)
* ఫ‌రూఖ్ ఇంజ‌నీర్ – 46 టెస్టులు (1961 నుంచి 1975 వ‌ర‌కు)

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే 50 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన వికెట్ కీప‌ర్ల జాబితాలో పంత్ 34వ స్థానంలో నిలిచాడు. వీరిలో ఇద్ద‌రు మాత్ర‌మే వంద‌కు పైగా టెస్టుల‌ను ఆడారు. ద‌క్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచ‌ర్ 147 టెస్టుల‌ను ఆడ‌గా ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ హీలీ 119 టెస్టుల‌ను ఆడారు. ధోనీ, ఆడమ్ గిల్ క్రిస్ట్‌, రాడ్ మార్ష్, అలన్ నాట్, గాడ్ఫ్రే ఎవాన్స్ సహా ఐదుగురు ఆటగాళ్లు తమ కెరీర్‌లో 90 లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఆడారు.