పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ వింతగా రనౌట్ అయ్యాడు. క్రికెట్ ప్రపంచంలోనే పాక్ ఆటగాళ్ల రనౌట్‌లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న దేశీవాలీ లీగ్ విటాలిటీ టీ20 బ్లాస్ట్. ప్రస్తుత సీజన్ 2019లో మిడిల్‌సెక్స్ టీమ్‌కి ఆడుతున్న హఫీజ్ మరోసారి ఏమరపాటుకు లోనై రనౌటయ్యాడు.
ఫన్నీ రనౌట్: స్పిన్నర్ రోలోఫ్ వాన్ డెర్ విసిరిన బంతిని డివిలియర్స్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. నేరుగా బంతి బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. మోకాళ్లపై కూర్చుని అందుకున్న రోలోఫ్ యాక్సిడెంటల్‌గా వెనక్కి విసిరాడు. దీంతో.. అప్పటికే క్రీజు వెలుపలికి వెళ్లిన హఫీజ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. బంతిని పట్టించుకోకుండా ముందుకెళ్లిన హఫీజ్ వెనక్కి వచ్చేసరికి అనుకున్నది అయిపోయింది.
టోర్నీలో భాగంగా సోమర్‌సెట్, మిడిల్‌సెక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆ జట్టులో టామ్ అబెల్ (101 నాటౌట్: 47 బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సులు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఛేదనకు దిగిన మిడిల్‌సెక్స్ జట్టుకి ఓపెనర్ డేవిడ్ మాలాన్ (41: 14 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభమిచ్చాడు. అయితే మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (25: 10 బంతుల్లో 4ఫోర్లు, సిక్సు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ఏబీ డివిలియర్స్ (32: 16 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) నిలకడగా ఆడాడు. కానీ. అతనికి కాసేపు సహకారం అందించిన మహ్మద్ హఫీజ్ (18: 16 బంతుల్లో 2ఫోర్లు) ఏమరపాటు కారణంగా రనౌటైపోయాడు.
ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ (83 నాటౌట్: 29 బంతుల్లో 5ఫోర్లు, 8సిక్సు) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో మిడిల్‌సెక్స్ జట్టు 17 ఓవర్లలోనే 227/4స్కోరు చేసి విజయం దక్కించుకుంది.
The cheekiest wicket you will ever see ?
➡️ https://t.co/a4OhqlSjZJ#Blast19 pic.twitter.com/y7KjfIIOYp
— Vitality Blast (@VitalityBlast) August 30, 2019