Rohit Sharma-Virat Kohli : రోహిత్, కోహ్లీ.. రెండు నెలలు క్రికెట్‌కు దూరం..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma-Virat Kohli ) రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 21, 2026 / 09:45 AM IST
Rohit Sharma and Virat Kohli next match play in september
Rohit Sharma-Virat Kohli : ఇంగ్లాండ్ పర్యటన భారత్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌ను ఎదుర్కొన్న టీమ్ఇండియా వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఇక ఇప్పుడు భారత జట్టు జూలై 23 నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది. కాగా.. టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిద్దరు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతో మళ్లీ వారిని మైదానంలో ఎప్పుడు చూస్తామా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
ఇప్పట్లో భారత జట్టు వన్డే మ్యాచ్‌లను ఆడదు. సొంతగడ్డపై సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్ కంటే ముందు భారత్ జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, శ్రీలంకలో లంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.
వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (138; 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, విరాట్ కోహ్లీ (74; 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే మ్యాచ్ – సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో,
* రెండో వన్డే మ్యాచ్ – సెప్టెంబర్ 30న గౌహతిలో
* మూడో వన్డే – అక్టోబర్ 3 న్యూ ఛడీగఢ్‌లో
