Rohit Sharma : ముంబై చేరుకున్న రోహిత్ శర్మ.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ఆడతాడా..!
దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న రోహిత్ శర్మ ముంబైకి చేరుకున్నాడు
- Thota Vamshi Kumar
- Published On : January 6, 2024 / 09:52 PM IST
Rohit Sharma arrives in Mumbai
Rohit Sharma arrives in Mumbai : దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న రోహిత్ శర్మ ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో రోహిత్‌కు ఘన స్వాగతం లభించింది. పలువురు అభిమానులు అతడితో కలిసి ఫోటోలు దిగారు. కాగా.. రోహిత్ శర్మ నాయత్వంలోని భారత జట్టు రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి టెస్టులో (5,0) విఫలమైన రోహిత్ శర్మ రెండో టెస్టులో (39, 17నాటౌట్) ఫర్వాలేనిపించాడు. కేప్‌టౌన్ విజయంతో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డులకు ఎక్కాడు.
టీమ్ఇండియా తొమ్మిది సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ధోని సారథ్యంలో 2010-11లో 1-1తో, రోహిత్ నాయకత్వంలో 2023-2024లో 1-1తో టెస్టు సిరీస్‌లను భారత్ డ్రా చేసుకుంది. మిగిలిన ఏడు సందర్భాల్లో ఓటములే ఎదురయ్యాయి. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం రోహిత్ శర్మ ఆడిన సిరీస్ ఇదే కావడం గమనార్హం.
IND vs AFG : భారత్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. రషీద్ ఖాన్‌కు షాక్..!
టీ20లు ఆడతాడా..!
టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ తరువాత టీమ్ఇండియా తరుపున పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ శర్మ మరో మ్యాచ్ ఆడలేదు. అయితే.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇస్తాడని, వెస్టిండీస్-అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024కు అతడి నాయకత్వంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది అనే వార్తలు వస్తున్నాయి.
BBL : ఏంటీ భయ్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!
అయితే.. నిజంగానే రోహిత్ శర్మ ఆడతాడా..? లేదా..? అనే దానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. రోహితో ఈ విషయం పై చర్చిస్తున్నారని, అందుకనే అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించేందుకు ఆలస్యం అవుతోందని అంటున్నారు.
భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* జనవరి 11న తొలి టీ20 – మొహాలి
* జనవరి 14న రెండవ టీ20 – ఇండోర్
* జనవరి 17న మూడో టీ20 – బెంగళూరు
