Rohit Sharma : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ స్పీచ్‌.. హార్దిక్‌కు కావాల్సింది అదే..

మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు మెడ‌ల్ ను అంద‌జేశారు.

Rohit Sharma Dressing Room Speech After first IPL 2024 Win

Rohit Sharma Dressing Room Speech : ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎట్ట‌కేల‌కు గెలుపు రుచి చూసింది. వాంఖ‌డే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 29 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లో 5 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ‌(49; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స‌ర్లు), టిమ్ డేవిడ్ (45 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (42; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రొమారియో షెపర్డ్ (39; 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు.

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ట్రిస్టన్ స్టబ్స్ (71నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు అర్థ‌శ‌త‌కాలు సాధించిన‌ప్ప‌టికీ ఓట‌మి త‌ప్ప‌లేదు.

Gautam Gambhir : చెన్నైతో మ్యాచ్‌కు ముందు ధోని పై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డు ఎన్న‌టికి వ‌దిలి పెట్ట‌డు

ఈ సీజ‌న్ నుంచి ముంబై కొత్త సంప్ర‌దాయానికి తెర‌తీసింది. మ్యాచ్‌లో రాణించిన ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు స్పెష‌ల్ అవార్డుల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు మెడ‌ల్ ను అంద‌జేశారు. ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడినందుకు రోహిత్‌కు అందించామ‌ని కోచ్ మార్క్ బౌచ‌ర్ అనౌన్స్ చేయ‌గా బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్ అంద‌జేశాడు.

అనంత‌రం రోహిత్ మాట్లాడుతూ.. స‌మిష్టిగా పోరాడితే విజ‌యాలు సాధించ‌వ‌చ్చున‌ని అన్నాడు. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని స‌మిష్టిగా రాణిస్తే భారీ స్కోర్లు సాధ్య‌మేన‌న్నాడు. ‘మ‌నం చాలా రోజులుగా మాట్లాడుకుంటుంది దీని గురించే గ‌దా.. మొద‌టి మ్యాచ్ నుంచి విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాం. ఈ రోజు సాధించాం. ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తే ల‌క్ష్యాన్ని చేరుకోగలం బ్యాటింగ్‌ కోచ్‌, కెప్టెన్‌ మన నుంచి ఆశిస్తున్నది ఇదే.’ అని రోహిత్ శ‌ర్మ అన్నాడు. రోహిత్ మాట్లాడిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Delhi Capitals : వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ఢిల్లీ కీల‌క నిర్ణ‌యం.. రూ.50ల‌క్ష‌ల‌కు కొత్త ప్లేయ‌ర్‌..

కాగా.. ఈ సీజ‌న్‌కు ముందు రోహిత్ ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి ముంబై ఇండియ‌న్స్ త‌ప్పించింది. అత‌డి స్థానంలో హార్దిక్ పాండ్య‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

ట్రెండింగ్ వార్తలు