×
Ad

Rohit Sharma : ఎలాన్ మ‌స్క్ మామూలోడు కాదురయ్యా.. రోహిత్ శ‌ర్మ కారు న‌డుపుతున్న వీడియోను పోస్ట్ చేసి..

రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కారు న‌డుపుతున్న వీడియోను టెస్లాక‌మినామిక్స్ పోస్ట్ చేసింది.

Rohit Sharma Drives New Tesla Model Y Elon Musk Promotes Post

Rohit Sharma : అక్టోబ‌ర్ 19 నుంచి భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రాణించేందుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma ) నెట్స్‌లో తీవ్రంగా సాధ‌న చేస్తున్నాడు. అయితే.. ఇటీవ‌ల అత‌డు ముంబైలో జ‌రిగిన సియ‌ట్ క్రికెట్ అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లాడు. అత‌డితో పాటు చాలా మంది క్రికెట‌ర్లు ఈ వేడుక‌కు హాజ‌రు అయిన‌ప్ప‌టికి కూడా అంద‌రి దృష్టి హిట్‌మ్యాన్ పైనే ఉంది.

ఈ కార్య‌క్ర‌మానికి రోహిత్ శ‌ర్మ.. త‌న భార్య రితికాతో క‌లిసి టెస్లా కొత్త మోడల్ Y కారులో వ‌చ్చాడు. హిట్‌మ్యాన్ టెస్లా కారును స్వ‌యంగా న‌డుపుకుంటూ వ‌చ్చిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల‌ను టెస్లాక‌మినామిక్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

IND vs WI 2nd Test : శ‌త‌క్కొట్టిన జైస్వాల్.. ముగిసిన తొలి రోజు ఆట‌.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌..


‘అందుకే టెస్లాను భార‌త్‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌మోట్ చేయాల్సిన ప‌ని లేదు. టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్య‌వ‌హిరించిన రోహిత్ శ‌ర్మ కొత్త టెస్లా కారు వై మోడ‌ల్‌ను కొనుగోలు చేసి డ్రైవ్ చేసుకుంటూ వ‌చ్చాడు. అత‌డికి ఇన్‌స్టాలో 45 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. అని రాసుకొచ్చింది.’ దీన్ని టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ రీట్వీట్ చేశారు.

Jasprit Bumrah : జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌..

కారు నంబ‌ర్ చూశారా?

కాగా.. ఈ టెస్లా కారు నంబ‌ర్ కూడా ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగింది. నంబ‌ర్ ప్లేట్ పై 3015 అని ఉంది. దీనికి అర్థం ఏంటో తెలుసా? హిట్‌మ్యాన్ త‌న కూతురు, కొడుకు పుట్టిన తేదీలు క‌లిపి వ‌చ్చేలా ఈ నంబ‌ర్‌ను తీసుకున్నాడు. రోహిత్ కూతురు స‌మైరా డిసెంబ‌ర్ 30న‌, కొడుకు అహాన్ న‌వంబ‌ర్ 15న జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.