Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. కోహ్లీ రికార్డు స‌మం

టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఓ అరుదైన ఘ‌న‌తను సాధించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును స‌మం చేశాడు.

Virat Kohli-Rohit Sharma

Rohit Sharma-Virat Kohli : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఓ అరుదైన ఘ‌న‌తను సాధించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును స‌మం చేశాడు. ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఈ రికార్డును అందుకున్నాడు. వన్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీతో క‌లిసి రోహిత్ శ‌ర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు విరాట్ కోహ్లీ 12 హాఫ్ సెంచరీలు చేయ‌గా తాజాగా రోహిత్ శ‌ర్మ సైతం ఇన్నే చేశాడు. ఇందుకోసం విరాట్‌కు 32 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ కేవ‌లం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ 44 ఇన్నింగ్స్‌ల్లో 21 అర్ధ‌శ‌త‌కాలతో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ప్రపంచ కప్‌లలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆట‌గాళ్లు..

స‌చిన్‌ టెండూల్కర్ (భార‌త్‌) – 21 (44 ఇన్నింగ్స్‌ల్లో)
రోహిత్ శర్మ (భార‌త్‌) – 12 (23 ఇన్నింగ్స్‌ల్లో)
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 12 (32 ఇన్నింగ్స్‌ల్లో)
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌)- 12 (34 ఇన్నింగ్స్‌ల్లో)
కుమార సంగక్కర (శ్రీలంక‌) – 12 (35 ఇన్నింగ్స్‌ల్లో)

Virat Kohli : స‌చిన్ రికార్డును స‌మం చేసిన కోహ్లీ.. సెంచ‌రీల రికార్డు కాదు సుమీ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది. శుభ్‌మ‌న్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయ‌స్ అయ్య‌ర్ (4) లు విఫ‌లం కావ‌డంతో 40 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. రోహిత్ శ‌ర్మ 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు 87 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు. 40 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 180/5. సూర్య‌కుమార్ యాద‌వ్ (30), ర‌వీంద్ర జ‌డేజా (7) లు ఆడుతున్నారు.