Rohit Sharma faces another injury scare ahead of India vs Pakistan match
India vs Pakistan : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గర పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు న్యూయార్క్‌లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు.
ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. జోష్ లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజాన్ని బలంగా తాకింది. దీంతో హిట్‌మ్యాన్ రిటైర్డ్ హట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ గాయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు.
SL vs BAN : సంచలనాలకు అడ్డాగా పొట్టి ప్రపంచకప్.. శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపు..
దీని నుంచి కోలుకున్న రోహిత్ పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా మరోసారి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ వేసి బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో రోహిత్ చేతి వేళ్లకు గాయమైంది. నొప్పితో రోహిత్ విలవిలలాడాడు. వెంటనే ప్రాక్టీస్ ఆపివేశాడు. వెంటనే వైద్య సిబ్బంది హిట్‌మ్యాన్‌కు చికిత్స అందించారు. తరువాత కొద్దిసేపు సాధన చేశాడు. నొప్పి తగ్గకపోవడంతో గ్రౌండ్‌ను వీడినట్లుగా తెలుస్తోంది.
కాగా.. రోహిత్ శర్మ గాయం పై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ గాయం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం అయితే అది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
NZ vs AFG : టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్ ఘన విజయం..