SL vs BAN : సంచ‌ల‌నాల‌కు అడ్డాగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌.. శ్రీలంక పై బంగ్లాదేశ్‌ గెలుపు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంచ‌ల‌నాల‌కు అడ్డ‌గా మారింది.

SL vs BAN : సంచ‌ల‌నాల‌కు అడ్డాగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌.. శ్రీలంక పై బంగ్లాదేశ్‌ గెలుపు..

pic credit : Bangladesh Cricket

Sri Lanka vs Bangladesh : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంచ‌ల‌నాల‌కు అడ్డ‌గా మారింది. ప‌సికూన‌లు అనుకున్న జ‌ట్లు పెద్ద జ‌ట్ల‌కు షాకిస్తున్నాయి. మొన్న అమెరికా మాజీ ఛాంపియ‌న్ పాకిస్తాన్‌ను మ‌ట్టిక‌రిపించ‌గా నేడు అఫ్గానిస్తాన్ జ‌ట్టు కివీస్‌కు షాకిచ్చింది. కొద్ది సేప‌టికే శ్రీలంక‌ను బంగ్లాదేశ్ ఓడించింది. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (47; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డు మినహా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో లంక ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహమాన్, రిషద్ హొస్సేన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

NZ vs AFG : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్‌ ఘ‌న విజ‌యం..

స్వ‌ల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో తాంజిద్ హసన్ (3), సౌమ్య సర్కార్ (0) ల‌తో పాటు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (7) విఫ‌లం కావ‌డంతో 28 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో సీనియ‌ర్ ఆట‌గాడు లిట‌న్ దాస్ (38 బంతుల్లో 36), తౌహిద్ హృదయ్ (20 బంతుల్లో 40) స‌మ‌యోచితంగా ఆడారు.

వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 63 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చ‌క్కదిద్దారు. అయితే.. ఈ దశ‌లో లంక బౌల‌ర్లు విజృంభించ‌డంతో బంగ్లా వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయింది. అయితే.. మహ్మదుల్లా (13 బంతుల్లో 16 నాటౌట్‌) జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. లంక బౌల‌ర్ల‌లో నువాన్ తుషార నాలుగు వికెట్లు తీశాడు. వానింద్ హ‌స‌రంగ రెండు వికెట్లు, మ‌తిరానా ఓ వికెట్ సాధించాడు.

David Warner : ఏమ‌య్యా వార్న‌ర్.. ఎటు పోతున్న‌వ్..? అరె నీకే చెప్పేది..!