Rohit Sharma : ప్లయింగ్ కిస్‌తో మయాంక్ అగర్వాల్‌ను ఆటపట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
- Harish Thanniru
- Updated on- March 27, 2024 / 10:27 AM IST
Rohit Sharma flying kiss
Rohit Sharma Flying kiss : ఐపీఎల్ 2024 టోర్నీ లో మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇరుజట్ల ప్లేయర్లు విజయంకోసం చివరి వరకు పోరాడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా పలుసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా ఎస్ఆర్ హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో హర్షిత్ రానా అతని వద్దకు వెళ్లి ప్లయింగ్ కిస్ ఇవ్వడంతో మయాంక్ సీరియస్ గా చూడటం కనిపించింది. ఇలా చేయడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్దం అంటూ నిర్వాహకులు హర్షిత్ రానాకు మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు.
Also Read : IPL 2024 : ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి కుక్క.. వారిపై జరిమానా విధించాలంటూ డిమాండ్
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అందరితో సరదగా ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సమయంలో మయాంక్ అగర్వాల్ వద్దకు వెళ్లిన రోహిత్ శర్మ.. అతని ప్లయింగ్ కిస్ ఇస్తూ ఆటపట్టించాడు. అచ్చం హర్షిత్ రానా ఇచ్చిన విధంగా ప్లయింగ్ కిస్ ఇవ్వడంతో మయాంక్ రోహిత్ చర్యకు నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IPL 2024 -CSK vs GT : చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర.. గుజరాత్ చిత్తు.. వరుసగా రెండోసారి చెన్నై విజయం
