IPL 2024 : ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి కుక్క.. వారిపై జరిమానా విధించాలంటూ డిమాండ్
క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చిన కుక్కను బయటకు పంపించే క్రమంలో గ్రౌండ్ సిబ్బంది దానిని కాలితో తన్నే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Dog entered stadium,
Dog In Narendra Modi Stadium : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా మార్చి 24న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో కుక్క మైదానంలోకి వచ్చి కొద్దిసేపు హల్ చల్ చేసింది. కుక్కను తరిమేందుకు స్టేడియం సిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఆ కుక్క వారిని తప్పించుకుంటూ కొద్దిసేపు మైదానంలో వారిని పరుగులు పెట్టించింది. కుక్కను పట్టుకొనేకుందనే గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. అయితే, కుక్కను పట్టుకునే క్రమంలో భద్రతా సిబ్బంది దానిపట్ల దురుసుగా ప్రవర్తించారని జంతు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : IPL 2024 -CSK vs GT : చెలరేగిన శివమ్ దూబే, రవీంద్ర.. గుజరాత్ చిత్తు.. వరుసగా రెండోసారి చెన్నై విజయం
క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చిన కుక్కను బయటకు పంపించే క్రమంలో గ్రౌండ్ సిబ్బంది దానిని కాలితో తన్నే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో గ్రౌండ్ లోకి వచ్చిన కుక్క పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే జరిమానా విధించాలని జంతు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘనకు సంబంధించి పెటా ఇండియా మాట్లాడుతూ.. దారి తప్పిన కుక్కను వెంటాడి తన్నడం, కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
Also Read : ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌కి సర్వం సిద్ధం.. భారీ బందోస్తు.. వీటిని అనుమతించరు..
కుక్క పొరపాటున క్రికెట్ మైదానంలోకి వచ్చిందని, దానిని జాగ్రత్తగా బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. కానీ, స్టేడియం సిబ్బంది దానిపట్ల దురుసగా ప్రవర్తించారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రస్తుతం కుక్క పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని జంతు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram