టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 100 మార్క్ చేరుకున్నాడు. టెస్టులో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
ఓవరాల్‌గా టెస్టులో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో సెంచరీ. టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ కెరీర్‌లో విశాఖ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రాణించి.. కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్(105), జడేజా(8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని టీమ్ ఇండియా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.