Rohit Sharma : గుజరాత్‌తో ముంబై మ్యాచ్ నేడే.. రోహిత్ శర్మ గాయం పై కీలక అప్‌డేట్..
తొడ కండరాల గాయం నుంచి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma ) కోలుకున్నట్లుగా సమాచారం.
- Thota Vamshi Kumar
- Updated on- April 20, 2026 / 10:18 AM IST
Rohit Sharma injury update ahead of IPL 2026 GT vs MI match
- నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్
- గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ
- గుజరాత్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడతాడా ? లేదా ? అన్న దానిపై స్పష్టత ఇచ్చిన ముంబై కోచ్
Rohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. ఈ సీజన్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై జట్టు ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేటు -1.076గా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (ఏప్రిల్ 20) గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌కు ముందు ముంబైకి శుభవార్త అందింది. తొడ కండరాల గాయం నుంచి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోలుకున్నట్లుగా సమాచారం. ఆదివారం అందరి కంటే ముందుగానే మైదానానికి వచ్చిన రోహిత్ శర్మ నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు ఎంతో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఈ విషయం తెలిసి హిట్‌మ్యాన్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
Shreyas Iyer : వినడానికి వింతగా ఉండొచ్చు.. కూపర్, ప్రియాన్ష్‌లకు ఓ ఛాలెంజ్ పెట్టాను..
కోచ్ ఏమన్నాడంటే?
గుజరాత్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే తెలిపాడు. మ్యాచ్‌కు ముందు జరిగే చివరి సెషన్‌లో అతడికి ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. దీనిని బట్టి రోహిత్ శర్మ విషయంలో ముంబై ఫ్రాంచైజీ ఎలాంటి తొందరపాటు పడడం లేదని తెలుస్తోంది.
Rohit training dump from Ahmedabad! 🫶 pic.twitter.com/eQvv2GqtSj
— Mumbai Indians (@mipaltan) April 19, 2026
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడాలని, భారీ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
