Rohit sharma : రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రోహిత్ శర్మ? ఫామ్‌లో లేకపోయిన పాండ్య ఎంపిక అందుకేనా?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ తరువాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా?
- Thota Vamshi Kumar
- Published On : May 14, 2024 / 10:48 AM IST
Rohit Sharma likely to retire from T20Is after T20 World Cup Report
Rohit Sharma Retirement : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ తరువాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపాడని అంటున్నారు. రోహిత్ వీడ్కోలు పలికాక హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకనే హార్దిక్ పాండ్య ఫామ్‌లో లేకపోయిన కానీ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కేలా సెలక్టర్లపై బీసీసీఐ ఒత్తిడి చేసిందని దైనిక్ జాగరణ్ తన రిపోర్టులో పేర్కొంది.
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని త్వరలోనే చెప్పనున్నట్లు తెలిపింది. కెప్టెన్సీ బాధ్యతలు పాండ్య కు అప్పగించాలనే ఉద్దేశ్యంతోనే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిందట. కాగా.. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీ20ల్లో టీమ్ఇండియాను హార్దిక్ పాండ్యనే నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
MS Dhoni : చెన్నైలో ధోనికి గుడి.. అంబటి రాయుడు వ్యాఖ్యలు వైరల్
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై పగ్గాలు అందుకున్న హార్దిక్ జట్టును విజయవంతంగా నడిపించడంలో విఫలయ్యాడు. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నిష్ర్కమించిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది.
పేలవంగా రోహిత్ శర్మ ఫామ్..
2022 టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ టీమ్ఇండియా తరుపున మూడు టీ20 మ్యాచులే ఆడాడు. ఇందులో రెండు మ్యాచుల్లో డకౌట్లు కాగా.. ఓ మ్యాచులో శతకంతో చెలరేగాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ రాణించలేకపోతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 6, 8, 4, 11, 19 పరుగులు చేశాడు.
IPL 2024 : ప్లేఆఫ్స్‌కు ముందు అయోమయంలో ఆర్‌సీబీ, రాజస్థాన్.. ఇప్పుడెలా?
ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ పై రోహిత్ బ్యాటింగ్ పై విమర్శలు చెలరేగాయి. 24 బంతులు ఆడి 19 పరుగులు చేశాడు. కాగా.. ముంబై జట్టులోని అంతర్గత విభేదాలు రోహిత్ ఆట తీరుపై ప్రభావం చూపించి ఉండవచ్చునని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదీ ఏమైనప్పటికీ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియ టీ20 ప్రపంచకప్‌ను సాధించాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.
