IPL 2024 : ప్లేఆఫ్స్‌కు ముందు అయోమయంలో ఆర్సీబీ, రాజస్థాన్.. ఇప్పుడెలా?
ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాకిచ్చారు. ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లను వీడుతూ ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు.
IPL : ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఒక్కటే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ లు ఇంటి బాటపట్టగా మిగిలిన మూడు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లు పోటీపడుతున్నాయి. మిగిలిన జట్లతో పోలిస్తే ఆర్ఆర్ ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే ఈజీగానే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
ఇలాంటి కీలక తరుణంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాకిచ్చారు. ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లను వీడుతూ ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లియామ్ లివింగ్ స్టోన్ శనివారమే లండన్‌కు వెళ్లిపోగా సోమవారం రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు జోస్ బట్లర్, బెంగళూరు ఆల్‌రౌండర్ విల్ జాక్స్, పేసర్ రీస్ టోప్లీ లు యూకే విమానం ఎక్కేశారు.
Gujarat vs Kolkata : వర్షార్పణం.. కోల్‌కతాతో మ్యాచ్ రద్దు.. ఫ్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్..!
ఇక కోల్‌కతాకు ఆడుతున్న ఫిల్ సాల్ట్, చెన్నై ఆల్‌రౌండర్ మోయిన్ అలీ లు సైతం నేడు రేపో ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. కాగా.. ప్లే ఆఫ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు లేకుండానే ఆయా ఫ్రాంచైజీలు బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకు వెళ్లిపోతున్నారంటే..?
భారత కాలమానం జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. పొట్టి ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌తో ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మే 22 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. మెగాటోర్నీకి ఎంపికైన ఆటగాళ్లు అందరూ పాకిస్తాన్‌తో సిరీస్‌లో ఆడాలని ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు భారత్‌ను వీడుతున్నారు.
MS Dhoni : చిన్న తలాను మైదానంలో చూడగానే ఎంఎస్ ధోని ఏం చేశాడంటే?
ఐపీఎల్ 2024కు దూరమయ్యే ఇంగ్లాండ్ ప్లేయర్లు..
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), మోయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), క్రిస్ జోర్డాన్ (పంజాబ్ కింగ్స్), లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్).