Rohit Sharma : రాంచీ టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- February 22, 2024 / 04:47 PM IST
Rohit Sharma
Rohit Sharma – Ranchi Test : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు హిట్‌మ్యానే కావడం విశేషం. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న రోహిత్ శర్మ మరో రెండు రికార్డులపై కన్నేశాడు. ఇంగ్లాండ్‌తో రాంచీ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి) 23 నుంచి జరగనున్న మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులను అందుకునే అవకాశం ఉంది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ లేని జట్టును ఊహించలేం. అంతలా తనదైన ముద్రను వేశాడు. అయితే.. కెరీర్ ఆరంభంలో టెస్టుల్లో మాత్రం ఎందుకనో ఆశించిన రీతిలో రాణించలేదు. సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌గా మారిన తరువాత టెస్టుల్లో సైతం తనదైన ముద్రను వేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఫార్మాట్లో 57 మ్యాచులు ఆడాడు. 98 ఇన్నింగ్స్‌ల్లో 3978 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి.
టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్‌కు మరో 22 పరుగులు అవసరం. రాంచీ టెస్టులోనే ఈ మైలురాయిని అతడు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో రికార్డు సైతం రోహిత్‌ను ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 600 సిక్సర్లు. ఇందుకోసం రోహిత్‌కు మరో ఏడు సిక్సర్లు అవసరం. మూడు ఫార్మాట్లలో 470 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 593 సిక్సర్లు బాదాడు. మరో ఏడు సిక్సర్లు బాదితే 600 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు
