IND vs ENG : రాంచీలో గెలిచేందుకు ఇంగ్లాండ్ ప‌క్కా వ్యూహాం.. తుది జ‌ట్టులో కీల‌క మార్పులు.. ఆ ఇద్ద‌రికి చోటు

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కీల‌క మ్యాచ్‌కు భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి.

IND vs ENG : రాంచీలో గెలిచేందుకు ఇంగ్లాండ్ ప‌క్కా వ్యూహాం.. తుది జ‌ట్టులో కీల‌క మార్పులు.. ఆ ఇద్ద‌రికి చోటు

England make two changes in playing XI for Ranchi Test

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కీల‌క మ్యాచ్‌కు భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్ జ‌ట్టు త‌మ సంప్ర‌దాయాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే ఇంగ్లాండ్ తుది జ‌ట్టును ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రాంచీ టెస్టుకు ముందు కూడా అదే ప‌ని చేసింది.

హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను ఘ‌నంగా ఆరంభించిన ఇంగ్లాండ్ ఆ త‌రువాత ప‌ట్టు స‌డ‌లించింది. విశాఖ‌, రాజ్‌కోట్ మ్యాచుల్లో ఓట‌మి పాలైంది. దీంతో సిరీస్‌లో 1-2 తేడాతో వెనుక‌బ‌డిపోయింది. ఈ క్ర‌మంలో సిరీస్‌లో నిల‌బ‌డాలి అంటే రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం సాధించ‌డం త‌ప్ప‌ని స‌రి. ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్ తుది జ‌ట్టులో కీల‌క మార్పులు చేసింది.

Mohammed Shami : చీల‌మండ‌ల గాయం.. ప‌ని చేయ‌ని ఇంజెక్ష‌న్లు.. ఐపీఎల్ నుంచి ష‌మీ ఔట్‌..! కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?

మార్క‌వుడ్‌, రెహాన్ అహ్మ‌ద్‌ల‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది. ఈ ఇద్ద‌రి స్థానాల్లో ఓలీ రాబిన్స‌న్‌, షోయ‌బ్ బ‌షీర్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది. కాగా.. రాబిన్స‌ర్‌కు ఈ సిరీస్‌లో ఇదే మొద‌టి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. విశాఖ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన బ‌షీర్‌ను మూడో టెస్టు మ్యాచ్‌కు ప‌క్క‌న బెట్టారు. మ‌ళ్లీ నాలుగో టెస్టులో ఛాన్స్ ఇచ్చారు.

కాగా.. రాంచీ పిచ్ స్పిన్‌కు అనుకూలం అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కూడా ఇంగ్లాండ్ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తోనే బ‌రిలోకి దిగుతుండ‌డం గ‌మ‌నార్హం. స్టార్ ఆట‌గాడు జోరూట్ పార్ట్ స్పిన్న‌ర్‌గా అద్భుతంగా రాణిస్తుండ‌డంతో మ‌రో స్పిన్న‌ర్ అవ‌స‌రం లేద‌ని ఇంగ్లాండ్ భావించి ఉండొచ్చు. అదే స‌మ‌యంలో ఈ సిరీస్‌లో దారుణంగా విఫ‌లం అవుతున్న విధ్వంస‌క‌ర ఆట‌గాడు జానీ బెయిర్ స్టో పై జ‌ట్టు మేనేజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచింది. మొత్తంగా బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

రాంచీ టెస్టుకు ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్( కెప్టెన్ ), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ ( వికెట్ కీపర్ ), టామ్ హార్ట్లీ, ఓలీ ఓలీ రాబిన్స‌న్‌, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్.