భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్‌మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ మోగించింది. లక్ష్య చేధనలో రోహిత్ శర్మ 60పరుగులు తీసిన తర్వాత విశ్రాంతి కోసం మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
రోహిత్ శర్మ కాలి పిక్కల్లో సమస్య తలెత్తడంతో అతనికి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో కివీస్ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను బరిలోకి దింపనున్నారు. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డేలతో అరంగ్రేటం చేసిన మయాంక్ కివీస్ జట్టును ఏ పాటిగా ఎదుర్కోగలడో చూడాలి.
రోహిత్ పార్టనర్ శిఖర్ ధావన్ ఫిబ్రవరి 5నుంచి జరిగే 3మ్యాచ్‌ల అనంతరం జట్టుకు దూరం కానున్నాడు. ఇటీవల టెస్టుల్లోనూ సత్తా చాటుతున్న రోహిత్.. జట్టులో లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్ లో రోహిత్ తన 25వ హాఫ్ సెంచరీకి మించిన పరుగులు నమోదు చేశాడు.