టీమిండియాతో జాయిన్ అయ్యేందుకు రోహిత్ శర్మ రెడీ

Rohit-Sharma

Rohit Sharma: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు జట్టుతో జాయిన్ అయ్యేందుకు అంతా రెడీ అయింది. మరో 48గంటల్లో మెల్‌‍బౌర్న్‌కు వెళ్లనున్నాడు రోహిత్. సిడ్నీలో 14రోజుల ఐసోలేషన్ పీరియడ్ పూర్తి చేసుకుని బుధవారంతో టీమ్‌తో కలవనున్నాడు. ప్రస్తుతం రోహిత్ సిడ్నీలోని తన రూంలోనే ఉంటున్నాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్న రోహిత్.. ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవనున్నాడు. ఐసోలేషన్ పీరియడ్ లో ఉండటంతో మొదటి రెండు టెస్టులకు జట్టులో అతణ్ని ఎంపిక చేయకుండా ఆపి ఉంచింది సెలక్షన్ కమిటీ. తర్వాత జరగబోయే టెస్టులోనూ తుది జట్టులో రోహిత్ ఉంటాడా లేదా అనేది అనుమానమే.

నవంబర్ 10 ఐపీఎల్ 2020 ఫైనల్ తర్వాత తొలి సారి కాంపిటీటివ్ క్రికెట్ లో కనిపించనున్నాడు. టెస్టు జట్టులో సెలక్ట్ అయినప్పటికీ సహచరులతో కలిసి ప్రయాణించలేదు రోహిత్. పర్సనల్ రీజన్స్ తో వెళ్లకపోవడంతో మరోసారి డిసెంబర్ 11న ఫిట్‌నెస్ టెస్టు పూర్తి చేసుకున్నాడు.

ప్రస్తుతం బాక్సింగ్ డే టెస్టు జరుగుతుండగా.. మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. కొవిడ్-19 నిబందనల రీత్యా దీనిపై ఎటువంటి అధికారిక స్టేట్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు
సిరీస్ లో టీమిండియాతో తొలి మ్యాచ్ ను ఓటమితో ముగించగా రెండో టెస్టు అదే ఫలితానికి చేరువైంది. మరి రోహిత్ చేరితో జట్టు దశ మారుతుందా.. ఫలితం ఏమవుతుందో చూడాల్సిందే.