Rohit Sharma-Shubman Gill
India vs Sri Lanka భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత జోడిగా రికార్డులకు ఎక్కారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఈ ఘనతను అందుకున్నారు.
ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు వచ్చారు. వీరిద్దరు కలిసి 36 పరుగులు చేయడంతో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనతను ఈ జోడీ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుంది. కాగా.. గతంలో ఈ రికార్డు రోహిత్-రాహుల్ పేరిట ఉండేది. రోహిత్-రాహుల్ జోడి 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేశారు.
Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో వరుసగా రెండు సార్లు 100 ఫ్లస్ భాగస్వామ్యాలను రోహిత్-గిల్ జోడి అందించింది. గ్రూప్ దశలో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 147, సూపర్-4 దశలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 121 పరుగులు మొదటి వికెట్ కు జోడించి భారత్ కు అద్భుత ఆరంభాలను అందించారు. అంతేకాదు.. ఈ జోడీ అత్యధిక సగటు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది
టీమ్ఇండియా తరుపున అత్యంత వేగంగా 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీలు..
* రోహిత్ శర్మ- శుభ్‌మన్ గిల్ (13 ఇన్నింగ్స్‌ల్లో)
* రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ (14ఇన్నింగ్స్‌ల్లో)
* ఎంఎస్ ధోనీ-గౌతమ్ గంభీర్ (14ఇన్నింగ్స్‌ల్లో)
* రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ(16ఇన్నింగ్స్‌ల్లో)
* ఎంఎస్ ధోనీ – సురేశ్ రైనా (16ఇన్నింగ్స్‌ల్లో)
* శిఖర్ ధావన్-అజింక్యా రహానే (16ఇన్నింగ్స్‌ల్లో)
* సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా(16ఇన్నింగ్స్‌ల్లో)
* మహ్మద్ అజారుద్దీన్-సునీల్ గవాస్కర్(16ఇన్నింగ్స్‌ల్లో)
Virat Kohli : పాకిస్తాన్ పై రికార్డు బ్రేక్ ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వైరల్..!