టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి టిక్ టాక్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెటైర్లు వేసుకునే చాహల్-రోహిత్‌లు మరోసారి అదే స్టైల్లో వీడియో షూట్ చేశారు. ధోల్(2007)అనే బాలీవుడ్ సినిమాలో సీన్‌ను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియోకు అమితమైన స్పందన వస్తుంది.
బాలీవుడ్ యాక్టర్లు రాజ్‌పాల్ యాదవ్, కునాల్ ఖీము, శర్మాన్ జోషీలు చేసే కామెడీ సీన్లో రోహిత్, ఖలీల్, చాహల్‌లు కనిపించారు. 2లక్షలకు పైగా వ్యూయర్స్ ను సంపాదించుకున్న వీడియోను చాహల్ ట్విట్టర్‌లో.. ఈ వీడియో పెడుతూ చాహల్ మేం మళ్లీ వచ్చేశామని పోస్టు పెట్టాడు.
రోహిత్ శర్మ పేపర్ చదువుతూ కూర్చుంటాడు. అదే సమయంలో చాహల్ పడుకుని ఉండగా ఖలీల్ అహ్మద్ అతణ్ని పట్టుకుని..’అర్రే ఇతని తల వెనక్కి తిరిగిపోయింది ఇటురా వచ్చి హెల్ప్ చెయి అంటాడు. దానికి రోహిత్ శర్మ లేచి తల అటుతిరగాలని చేతితో గుద్దుతూ ఉంటాడు. వాళ్ల నుంచి విడిపించుకున్న చాహల్.. పైకి లేచి నేను షర్ట్ వెనకది ముందుకు వేసుకున్నా అంతే. మెడ తిరగలేదు అని అంటాడు. దానికి ఖలీల్ అహ్మద్ మరి అలా ఎందుకేసుకున్నావ్ బే’ అని కాలుతో కొడతాడు.
We are back ?? @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020