Rohit Sharma Captaincy: హిట్ మ్యాన్ కెప్టెన్సీ సూపరో సూపరు.. వరుస వికెట్లు

టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంత సూపరో ముంబై ఇండియన్స్ రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ టీ20ల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

Rohit Sharma Captaincy: టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంత సూపరో ముంబై ఇండియన్స్ రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ టీ20ల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. టీమిండియాను పలు మార్లు విజయపంథాలో నడిపించాడు. ఇది మరోసారి రుజువైంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో కూడా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కాలికి గాయం అవడంతో మైదానం వీడాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులతో పటిష్టంగా ఉంది. స్టోక్స్‌, మోర్గాన్‌ లాంటి హిట్టర్స్‌ క్రీజులో ఉండటంతో భారత్‌ విజయావకాశాలపై ఆశలు సన్నగిల్లాయి.

ఇలాంటి సమయంలో కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు అందుకున్నాడు రోహిత్‌. ఒత్తిడికి గురవకుండా మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ ప్రణాళికలను అమలు పరిచి విజయవంతమయ్యాడు. 17వ ఓవర్‌ బౌలింగ్‌ చేయడానికి శార్దూల్ ఠాకూర్‌కు సూచనలిచ్చాడు. దానికి అనుగుణంగా ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు.

ఈ ఓవర్‌ మొదటి బంతికి స్టోక్స్‌, తర్వాత బాల్‌కి మోర్గాన్‌ ఔటయ్యారు. దీంతో మ్యాచ్‌పై ఇండియా పైచేయి సాధించింది.

‘సమయం తీసుకుని ఆలోచించి నేచరల్‌గా బౌలింగ్‌ చెయ్‌. మైదానం ఓ వైపు పెద్దగా, మరో వైపు చిన్నగా ఉంది. అందుకనుగుణంగా బౌలింగ్‌ ప్లాన్ చేసుకుని బంతులు వెయ్’ అని రోహిత్‌ సూచనలిచ్చాడని మ్యాచ్‌ ముగిసినంతరం శార్దూల్‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు