Sachin Tendulkar – Mirabai Chanu: సచిన్ సార్‌ను కలవడం ఒక అద్భుతం – మీరాబాయి ఛాను

టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది.

Sachin Tendulkar – Mirabai Chanu: టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది. గత నెలలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.

కరణం మళ్లీశ్వరీ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఫీట్ సాధించి రెండో మహిళగా నిలిచారు. 2020ఒలింపిక్స్ 49కేజీల విభాగంలో మీరాబాయి ఈ ఫీట్ సాధించగా.. 2000 సిడ్నీ ఒలింపిక్స్ కాంస్యం గెలిచారు మల్లీశ్వరి. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఇండియాకు అదే తొలి పతకం.

సచిన్ ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసిన మీరాబాయి.. ‘లవ్లీ మీటింగ్.. ఈ రోజు ఉదయం ఆయన్ను కలిశాను. అతని తెలివి, మోటివేషన్ ఎప్పుడూ నాతో ఉంటాయి. నిజంగా ఇన్‌స్పైర్ అయ్యా’ అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేసిన కొద్ది గంటల తర్వాత సచిన్ రిప్లై ఇచ్చారు. ‘ఈ రోజు ఉదయం ఆమెను కలిసినందుకు నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యా. మణిపూర్ నుంచి టోక్యో వరకూ చేరిన ప్రయాణం అద్భుతం. రాబోయే కాలంలో మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నా. ఇలాగే కష్టపడు’ అని సచిన్ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు