Sachin Tendulkar Statue
Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహన్ని ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీసీసీఐ కార్యదర్శి జైషా, కోశాధికారి ఆశిష్ షెలార్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎన్సీపీ చీఫ్, బీసీసీఐ, ఐసీసీ మాజీ చీఫ్ శరద్ పవార్, ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 2 గురువారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేడియంలోని సచిన్ టెండూల్కర్ స్టాండ్ కు సమీపంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే.. విగ్రహా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
#WATCH | Statue of Cricket legend Sachin Tendulkar unveiled at Wankhede Stadium in Mumbai.
Sachin Tendulkar, Maharashtra CM Eknath Shinde, BCCI Secretary Jay Shah, BCCI Vice President Rajeev Shukla, NCP chief and former BCCI & ICC chief Sharad Pawar, MCA President Amol Kale and… pic.twitter.com/X5REr5yUJO
— ANI (@ANI) November 1, 2023
Glenn Maxwell : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. గోల్ఫ్ ఆడుతూ గాయపడిన మాక్స్‌వెల్..
టెండూల్కర్ యొక్క అద్భుతమైన కెరీర్, భారత క్రికెట్‌కు చేసిన కృషికి నివాళిగా ఈ విగ్రహాన్ని అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు-శిల్పి ప్రమోద్ కాంబ్లే రూపొందించారు. ఈ విగ్రహం టెండూల్కర్ కు చెందిన ఐకానిక్ షాట్లలో ఒకటైన లాఫ్టెడ్ షాట్‌ను ప్రతిబింబిస్తుంది. విగ్రహావిష్కరణ సందర్భంగా అభిమానులు సచిన్ సచిన్ అంటూ చేసిన నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. ఈ విగ్రహం ఎత్తు 22 అడుగులు.
కల తీరిన మైదానంలోనే..
సచిన్ టెండూల్కర్‌కు వాంఖడే మైదానంలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అంటే..తన 200వ టెస్టు మ్యాచ్‌ను ఇదే వేదిక పై ఆడాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ 74 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మరోసారి సచిన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక సచిన్ చిరకాల కోరిక తీరింది ఈ స్టేడియంలోనే. భారత జట్టు 28 సంవత్సరాల తరువాత రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది ఇక్కడే. ధోని నాయకత్వంలోని భారత్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇది సచిన్ కు ఆఖరి, ఆరో వన్డే ప్రపంచకప్ అన్న సంగతి తెలిసిందే.
Sachin…Sachin… The Statue is inaugurated at Wankhede @sachin_rt @100MasterBlastr pic.twitter.com/Q8E46miSC0
— Sachin Tendulkar Fan Club (@OmgSachin) November 1, 2023
వాంఖడే స్టేడియంలో విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి టెండూల్కర్‌తో పాటు అతని భార్య అంజలి, కుమార్తె సారా కూడా హాజరయ్యారు.