Saina Nehwal : విమర్శకులకు సైనా కౌంటర్.. ‘ముందు ఒలింపిక్స్‌కు అర్హత సాధించండి..’
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది
- Thota Vamshi Kumar
- Published On : September 10, 2024 / 07:00 PM IST
Saina Nehwal Slams Gifted Bronze Medal Dig
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. వివిధ అంశాల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు పై సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శల పట్ల ఆమె కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
2012 ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇది ఆమెకు అదృష్టవశాత్తు బహుమతిగా వచ్చిందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై సైనా స్పందించింది. ఇలాంటి వాళ్లంతా ముందుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఆ తరువానే మాట్లాడాలని అన్నారు.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. షమీ, శ్రేయస్‌కు నో ఛాన్స్.. ఎందుకంటే..?
ఆరేండ్లుగా అంతర్జాతీయ పోటీలకు సైనా దూరంగా ఉంది. తాను ఆర్ధరైటిస్ అనే సమస్యతో బాధ పడుతున్నట్లు ఇటీవల ఆమె చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా.. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆఖరి బౌట్‌కు ముందు నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉంది అన్న కారణంతో రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సైనా మాట్లాడుతూ.. సాధారణంగా ఇలాంటి తప్పులు ఈ స్థాయిలో ఏ అథ్లెట్‌కు జరగదు. ఆమెకు అతి పెద్ద జట్టు ఉంది. కోచ్‌లు, ఫిజియోలు, శిక్షకులు చాలా మంది ఆమె బృందంలో ఉన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తనకు తెలియదని, అయితే.. ఇందులో ఆమె తప్పు కూడా ఉండి ఉండవచ్చునని అంది. సైనా చేసిన ఈ కామెంట్లపై అభిమానుల ట్రోలింగ్‌కు కారణమైంది.
Suryakumar Yadav : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు సూర్య!
