IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. షమీ, శ్రేయస్‌కు నో ఛాన్స్.. ఎందుకంటే..?
టీమ్ఇండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది.

Why Shreyas Iyer Mohammed Shami Werent Picked For 1st Bangladesh Test
IND vs BAN 1st test : టీమ్ఇండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు మ్యాచ్ కోసం 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి టీమ్ఇండియాలో స్థానం దక్కించుకున్నాడు. అయితే.. టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌లకు స్థానం దక్కలేదు.
గాయం నుంచి కోలుకున్న షమీ తొలి టెస్టు నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని వార్తలు రాగా.. దులీప్ ట్రోఫీలో రాణించినప్పటికి కూడా శ్రేయస్ అయ్యర్‌కు 16 మంది జాబితాలో ఎందుకు చోటు దక్కకపోవడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం షమీ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. అయ్యర్ ఫిట్‌గానే ఉన్నప్పటికి కూడా అతడి నిలకడలేమీ కారణంగా చోటు దక్కించుకోలేకపోయినట్లుగా వెల్లడించింది.
Rinku Singh : రింకూ సింగ్‌కు పిలుపు.. జట్లను ప్రకటించిన బీసీసీఐ
రెడ్ బాల్ క్రికెట్‌లో అయ్యర్ నిలకడలేమీతో పాటు 2024 పేలవ సీజన్ వల్ల అయ్యర్ రీ ఎంట్రీ గురించి సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి ఓ కారణం అని తెలిపింది. అదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ వంటి వారు మిడిల్ ఆర్డర్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతుండడం మరో కారణం అని పేర్కొంది.
ఇక షమీ విషయానికి వస్తే.. వన్డే ప్రపంచకప్ అనంతరం గాయం కారణంగా షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ నాటికి షమీ ఫిట్‌నెస్ సాధిస్తాడని గతంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. షమీ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడిని రెండో టెస్టుకు సైతం ఎంపిక చేసే అవకాశం కనిపించడం లేదు.
Suryakumar Yadav : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బంగ్లాతో టీ20 సిరీస్‌కు సూర్య!
అక్టోబర్ 11న నుంచి ప్రారంభం కానున్న రంజీట్రోఫీలో అతడు బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే టీమ్ఇండియాలోకి రావడం లాంఛనమే.