లాక్‌డౌన్ ప్రజలను పిచ్చోళ్లని చేసింది: సాక్షి ధోనీ

  • Publish Date - May 28, 2020 / 06:52 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లాక్‌డౌన్ ప్రజలను పిచ్చోళ్లని చేసింది’ అన్నారు. ఈ కామెంట్లు ఎందుకు చేశారో తెలుసా.. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ధోనీ రిటైర్ అవుతాడంటూ కామెంట్లు వినిపించాయి. అవి నిజాలు కావంటూ కొట్టిపారేసిన సాక్షి మరోసారి #DhoniRetires హ్యాష్ ట్యాగ్ తో జరుగుతున్న ట్రోలింగ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

‘ఇవి కేవలం రూమర్లు మాత్రమే. లాక్‌డౌన్ ప్రజల మానసిక పరిస్థితి అయోమయంగా చేసిందని నేను అర్థం చేసుకోగలను’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ పెట్టి కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం. ధోనీ రిటైర్మెంట్ పై స్పందించడం సాక్షికి ఇది తొలిసారేం కాదు. గతేడాది సెప్టెంబరులోనూ సోషల్ మీడియాలో ధోనీ భవిష్యత్ పై వచ్చిన ట్రోలింగ్‌కు స్పందించారు. వీటినే రూమర్లు అంటారు. 

2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి ధోనీ అడుగుపెట్టకపోవడంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆ మ్యాచ్ టీమిండియా ఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనైనా ధోనీ బ్యాట్ పట్టుకుని క్రీజులో కనిపిస్తాడని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. లీగ్ రద్దు కావడంతో IPL 13సీజన్ ప్రశ్నార్థకం అయిపోయింది. 

ఇక ధోనీ ముందు మిగిలింది ఒకే ఒక్కటి T20 World Cupకు జట్టులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే అది కూడా COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడటంతో ఈ లెజెండ్ ఇండియన్ జెర్సీలో కనిపించాలంటే ఇంకా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. 

Read: డిసెంబర్ 3న India Vs Australia Test..?