×
Ad

Salman Ali Agha : భార‌త్‌తో ఆడొద్ద‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కామెంట్స్..

భార‌త్‌తో మ్యాచ్ ఆడొద్ద‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ (Salman Ali Agha) అఘా స్పందించాడు.

Salman Ali Agha reaction after government decides boycott India match in T20 World Cup

Salman Ali Agha : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య శ్రీలంక‌లోని ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాల్సిందిగా త‌మ జ‌ట్టును పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో భార‌త్, పాక్ మ్యాచ్ పై అనిశ్చితి నెల‌కొంది. కాగా.. దీనిపై పాకిస్తాన్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా స్పందించాడు.

ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో స‌ల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. మేం ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌బోతున్నాము. ఈ విష‌యంలో (భారత్‌తో ఆడకూడదనే నిర్ణయం) తామేమీ చేయ‌లేమ‌ని చెప్పాడు. తాము ఆ నిర్ణ‌యాన్ని తీసుకోలేద‌న్నాడు. ప్ర‌భుత్వం, పీసీబీ ఛైర్మ‌న్ ఆదేశాల‌ను మాత్ర‌మే తాము పాటించాల్సి ఉంద‌న్నాడు. వాళ్లు ఎలా చెబితే తాము అలా చేస్తామ‌ని చెప్పుకొచ్చాడు.

T20 World Cup 2026 : భార‌త్‌తో మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తే.. మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూప్ స్టేజీ నుంచే పాక్ ఔట్‌..!

ఇదిలా ఉంటే.. భార‌త్‌తో మ్యాచ్ బ‌హిష్క‌ర‌ణ విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ఐసీసీకి తెలియ‌జేయ‌లేదు. సోమ‌వారం దీని గురించి ఐసీసీతో పీసీబీ మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ భార‌త్‌తో మ్యాచ్‌ను గ‌నుక పాక్ బాయ్‌కాట్ చేస్తే.. అప్పుడు పీసీబీపై ఐసీసీ క‌ఠిన చర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

పాక్ నిర్ణ‌యం ఎలా ఉన్నా స‌రే భార‌త ఆట‌గాళ్లు మాత్రం షెడ్యూల్ ప్ర‌కారం శ్రీలంక‌కు వెలుతార‌ని, ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొంటార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజామ్‌.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..

భార‌త్‌తో మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేస్తే.. ఐసీసీ తీసుకునే చ‌ర్య‌లు ఇవేనా?

* పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో విదేశీ ఆట‌గాళ్లు పాల్గొన‌కుండా స‌భ్య‌దేశాలు ఆట‌గాళ్ల‌కు నిరభ్యంత‌ర ప‌త్రాలు (ఎన్ఓసీలు) ఇవ్వ‌కుండా చేయ‌డం
* ఐసీసీ టోర్నమెంట్ల‌ను నిర్వ‌హించే హ‌క్కుల‌ను పాక్ కోల్పోనుంది.
* ఇక ప్ర‌తి ఏడాది ఐసీసీ నుంచి అందే రెవెన్యూ వాటాల‌ను కోల్పోనుంది.