Sania Mirza : విడాకుల త‌రువాత సానియా మీర్జా మొద‌టి పోస్ట్‌.. ఏమ‌న్న‌దంటే..?

పాకిస్తాన్ సీనియ‌ర్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్‌తో విడాకుల త‌రువాత భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొద‌టి సారి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Sania Mirza

Sania Mirza Post After Divorce : పాకిస్తాన్ సీనియ‌ర్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్‌తో విడాకుల త‌రువాత భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మొద‌టి సారి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అద్దంలో చూసుకుంటున్న త‌న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్‌కు రిప్లెక్ట్ అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. సానియా పెట్టిన క్యాప్ష‌న్‌కు చాలా లోతైన అర్థం ఉంటుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

రిప్లెక్ట్ అంటే సాధార‌ణంగా ప్ర‌తిబింబించు అని అర్థం అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. సానియా పెట్టిన పోస్ట్ త‌న వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి అయి ఉంటుంద‌ని అంటున్నారు. తాను ప‌రోక్షంగా ఇలా ప్ర‌స్తావించి ఉండ‌వ‌చ్చున‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను సానియా అధిగ‌మించి ఆమె జీవితంలో మ‌ళ్లీ ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

Kane Williamson : కేన్ మామ వ‌చ్చేశాడు.. ర‌చిన్ ర‌వీంద్ర‌కు చోటు..

షోయ‌బ్ మాలిక్‌ను 2010లో సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. సానియాకు ఇది మొద‌టి వివాహం కాగా షోయ‌బ్‌కు ఇది రెండో పెళ్లి. త‌న మొద‌టి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల తీసుకున్న అనంత‌రం సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు షోయ‌బ్‌. వీరికి 2018లో ఓ కుమారుడు జ‌న్మించాడు.

కాగా.. ఇటీవ‌ల షోయ‌బ్ మాలిక్ పాకిస్తాన్ న‌టి స‌నా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. అయితే.. కొద్ది నెల‌ల కింద‌టే సానియా, షోయ‌బ్‌లు విడాకులు తీసుకున్న‌ట్లు సానియా కుటుంబం తెలియ‌జేసింది.

‘త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని సానియా గోప్యంగా ఉంచుకుంటుంది. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంది. అయితే.. ఇప్పుడు కొన్ని విష‌యాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. షోయ‌బ్ మాలిక్‌తో కొన్ని నెల‌ల కింద‌టే ఆమె విడాకులు తీసుకుంది. షోయ‌బ్ కొత్త ప్ర‌యాణం బాగుండాల‌ని ఆమె కోరుకుంటుంది.’ అని సానియా కుటుంబం త‌రుపున నుంచి ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ICC Awards 2023: ఐసీసీ అవార్డుల్లో భారత్ ఆధిపత్యం.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. పూర్తి జాబితా ఇదే

ట్రెండింగ్ వార్తలు