Kane Williamson : కేన్ మామ వ‌చ్చేశాడు.. ర‌చిన్ ర‌వీంద్ర‌కు చోటు..

ద‌క్షిణాఫ్రికాతో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్ కోసం మాజీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ న్యూజిలాండ్ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Kane Williamson : కేన్ మామ వ‌చ్చేశాడు.. ర‌చిన్ ర‌వీంద్ర‌కు చోటు..

New Zealand name Williamson Ravindra for Proteas Tests

Updated On : January 26, 2024 / 10:42 AM IST

Kane Williamson – Rachin Ravindra : ద‌క్షిణాఫ్రికాతో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్ కోసం మాజీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ న్యూజిలాండ్ జ‌ట్టును ప్ర‌క‌టించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం 14 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. భార‌త సంత‌తి ఆట‌గాడు, వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో అద‌ర‌గొట్టిన ర‌చిన్ ర‌వీంద్రకు మ‌రోసారి టెస్టుల్లో అవ‌కాశం ద‌క్కింది.

పేస‌ర్ విల్ ఓ రూర్కీ తొలి సారి సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక అయ్యాడు. టిమ్ సౌథీ సార‌ధ్యంలో కివీస్ బ‌రిలోకి దిగ‌నుంది. గాయంతో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో చివ‌రి మూడు మ్యాచుల‌కు దూర‌మైన సీనియ‌ర్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్ స‌న్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడు హెన్రీ నికోల్స్‌కు సెల‌క్ట‌ర్లు మొండి చేయి చూపించారు.

ICC Awards 2023: ఐసీసీ అవార్డుల్లో భారత్ ఆధిపత్యం.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. పూర్తి జాబితా ఇదే

న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..
టిమ్ సౌథీ(కెప్టెన్‌), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్క్ (రెండవ టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
నీల్ బ్రాండ్ (కెప్టెన్‌), డేవిడ్ బెడింగ్‌హామ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరెకి, ఎడ్వర్డ్ మూర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డువాన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్‌సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్ .

Virat Kohli : త‌గ్గేదేలే.. ఐసీసీ మెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్-2023గా విరాట్ కోహ్లీ