Virat Kohli : తగ్గేదేలే.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023గా విరాట్ కోహ్లీ
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీని వరించింది.

Virat Kohli
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీని వరించింది. 2023 సంవత్సరానికి గాను అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో అవార్డు గెలుచుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇది నాలుగో సారి. 2012,2017, 2018, 2023 సంవత్సరాల్లోనూ అతడు ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.
2023లో విరాట్ కోహ్లీ 27 వన్డే మ్యాచులు ఆడాడు. 1377 పరుగులు చేశాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. 11 మ్యాచుల్లో 95.62 సగటుతో 90.31 స్ట్రైక్ రేటుతో 765 పరుగులు చేశాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో 2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. కాగా.. టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
తొలి రోజు టీమ్ఇండియాదే.. దంచికొట్టిన యశస్వి జైస్వాల్
ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు పై సెంచరీతో చెలరేగాడు. ఇది వన్డేల్లో విరాట్ కోహ్లీ 50వ శతకం కావడం విశేషం. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా ఈ ఏడాది 27 వన్డే మ్యాచులు ఆడిన కోహ్లీ 24 ఇన్నింగ్స్‌ల్లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు.
??? ???’? ??? ????????? ?? ??? ???? ????
It goes to none other than Virat Kohli! ??
Congratulations ??#TeamIndia | @imVkohli pic.twitter.com/1mfzNwRfrH
— BCCI (@BCCI) January 25, 2024