తొలి రోజు టీమ్ఇండియాదే.. దంచికొట్టిన య‌శ‌స్వి జైస్వాల్‌

ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది.

తొలి రోజు టీమ్ఇండియాదే.. దంచికొట్టిన య‌శ‌స్వి జైస్వాల్‌

IND vs ENG 1st Test day 1

IND vs ENG 1st Test day 1 stumps : ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 119 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 127 ప‌రుగుల దూరంలో భార‌త్ ఉంది.

య‌శ‌స్వి జైస్వాల్ దూకుడు..

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగాడు. టీ20 త‌ర‌హాలో అత‌డి బ్యాటింగ్ సాగింది. మ‌రో ఎండ్ లో రోహిత్‌శ‌ర్మ (24) స‌మ‌యోచితంగా ఆడగా జైస్వాల్ మాత్రం ఏ బౌల‌ర్‌ను విడిచిపెట్ట‌లేదు. ఈ క్ర‌మంలో 47 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు.

Also Read: విరాట్ కోహ్లీ జెర్సీ ధ‌రించి రోహిత్ శ‌ర్మ కాళ్ల‌కు దండం పెట్టిన అభిమాని.. వీడియో వైర‌ల్

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న వీరి జోడిని రోహిత్ శ‌ర్మను ఔట్ చేయ‌డం ద్వారా జాక్ లీచ్ విడ‌గొట్టాడు. రోహిత్, జైస్వాల్ జోడి మొద‌టి వికెట్‌కు 80 ప‌రుగులు జోడించారు. అనంత‌రం వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్‌, జైస్వాల్‌తో క‌లిసి మ‌రో వికెట్ పడ‌కుండా మొద‌టి రోజును ముగించారు.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బెన్‌స్టోక్స్..

అంత‌క‌ముందు ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెన‌ర్లు జాక్ క్రాలీ(20), బెన్ డ‌కెట్ (35) లు మొద‌టి వికెట్‌కు 55 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే.. భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఇంగ్లాండ్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో 60 ప‌రుగుల‌కే మూడు వికెట్లు న‌ష్టపోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో జానీ బెయిర్ స్టో (37), జో రూట్ (29)లు ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ‌త్య‌ను భుజాన వేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 61 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. జానీ బెయిర్ ఔటైన క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ బెన్‌స్టోక్స్ (70; 88 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స‌ర్లు) ఆచితూచి ఆడాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ క్రీజులో కుదురుకున్నాక త‌న దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ ఆఖ‌రి వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

Also Read : చ‌రిత్ర సృష్టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఒకే ఒక్క భార‌తీయుడు