LSG : అయోధ్యలో లక్నో యజమాని సంజీవ్ గొయెంకాతో రిషబ్ పంత్.. పిక్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గొయెంకా తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించారు.
- Thota Vamshi Kumar
- Updated on- March 21, 2026 / 04:19 PM IST
Sanjiv Goenka and Rishabh Pant Visit Ram Janmabhoomi Ahead Of IPL 2026
- మార్చి 28 నుంచి ఐపీఎల్
- అయోధ్యకు వెళ్లిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్
- శ్రీరాముడి ఆశీస్సుల కోసం
LSG : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో విజయం సాధించేందుకు అన్ని జట్లు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా మాత్రం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించారు. ఆలయంలో వారు పూజలు చేశారు. వారితో పాటు లక్నో జట్టులోని పలువురు ఆటగాళ్లు కూడా ఉన్నారు.
ఇక పూజల అనంతరం సంజీవ్ గొయెంకా మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కాబోతుండడంతో శ్రీరాముడి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు తెలిపారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని సాధించడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. డాక్టర్ సంజీవ్ గొయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు జట్టులోని పలువురు సభ్యులు అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించారు. అని తెలిపింది. ఆఖరిలో జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చింది. సంజీవ్ గొయెంకా, రిషబ్ పంత్ ఉన్న ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఆ తరువాత ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్‌రైడర్స్, ఏప్రిల్ 12న గుజరాత్ టైటాన్స్‌తో లక్నో తలపడనుంది.
