Suryakumar Yadav : నేను కెప్టెన్‌ను కాదు.. ఆ విషయం హార్దిక్‌ను అడగాలి.. తిలక్ ప్రశ్నపై సూర్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా (Suryakumar Yadav) ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్న సంగతి తెలిసిందే.
Suryakumar Yadav tells Tilak Varma after he asks if he bat at no3 for MI in IPL 2026
Suryakumar Yadav : ఐపీఎల్ 2026 కి రంగం సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆరోసారి విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టులోని నలుగురు స్టార్ ప్లేయర్లు.. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు ముంబై ఇండియన్స్‌లో ఉన్నారు.
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా తరుపున ఆడేటప్పుడు తిలక్ వర్మకు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో పంపాడు సూర్యకుమార్ యాదవ్.
What the world doesn’t know about Tilak Varma? 🤫
Will he take charge at No.3? Surya spills it all! ⚡
Superstar vibes, unfiltered masti, and pure MI energy 💙#TATAIPL 2026 👉 #RCBvSRH | SAT, 28th MAR, 5.30 PM pic.twitter.com/qBnYt2PEej
— Star Sports (@StarSportsIndia) March 20, 2026
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దీని గురించి తిలక్ మాట్లాడుతూ.. ఐపీఎల్లో తాను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తానా? లేదా? అని సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు.
వెంటనే సూర్య నవ్వేశాడు.. ‘ఈ విషయం నాకు తెలియదు. ఐపీఎల్లో నేను నీకు కెప్టెన్‌ను కాదు. ఈ విషయం నువ్వు హార్దిక్ ను అడగాలి అనుకుంటాను.’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
