Sanju Samson : చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంస‌న్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఏకైక భార‌తీయుడు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు సంజూ శాంస‌న్ (Sanju Samson ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sanju Samson creates history Fewest balls to 5000 IPL runs (pic credit@ipl)

  • ఐపీఎల్‌లో 5 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న సంజూ శాంస‌న్‌
  • బంతుల ప‌రంగా అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల్లోకి
  • ఈ క్ర‌మంలో సురేశ్ రైనా, ధోని, కేఎల్ రాహుల్ రికార్డులు బ్రేక్‌

Sanju Samson : చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు సంజూ శాంస‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో 5 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘ‌న‌త‌ను అత్యంత వేగంగా (బంతుల ప‌రంగా) అందుకున్న భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఆదివారం (ఏప్రిల్ 26) చెపాక్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో కగిసో రబాడా వేసిన రెండో ఓవర్‌లోని రెండో బంతికి బౌండరీ కొట్టి ఈ మైలురాయిని అందుకున్నాడు.

Lucknow Super Giants : ఐపీఎల్ రూల్స్ దెబ్బ కొట్టాయా? ఐదు వికెట్లు తీసిన బౌల‌ర్‌తో సూప‌ర్ ఓవ‌ర్‌ను వేయించ‌ని ల‌క్నో.. షాకింగ్ రీజ‌న్‌

ఐపీఎల్‌లో బంతుల ప‌రంగా అత్యంత వేగంగా 5 వేల ప‌రుగులు అందుకున్న భార‌త ఆట‌గాడిగా గ‌తంలో సురేశ్ రైనా ఉండేవాడు. 3620 బంతుల్లో రైనా 5 వేల పరుగులు చేయ‌గా సంజూ శాంస‌న్ 3555బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఓవ‌రాల్‌గా మూడో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఏబీ డి విలియర్స్ (3,288 బంతులు), డేవిడ్ వార్నర్ (3,554 బంతులు) మాత్ర‌మే ఈ జాబితాలో సంజూ శాంస‌న్ క‌న్నా ముందు ఉన్నాడు.

బంతుల ప‌రంగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5 వేల ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* ఏబీ డివిలియర్స్ – 3288
* డేవిడ్ వార్నర్ – 3554
* సంజూ శాంస‌న్ – 3555
* సురేశ్ రైనా – 3620
* కేఎల్ రాహుల్ – 3688
* ఎంఎస్ ధోని – 3691

Nicholas Pooran vs Sunil Narine : 12 ఏళ్ల క్రితం ఇలాగే.. న‌రెన్ వ‌ర్సెస్ పూర‌న్‌.. ఫామ్‌లో లేని ఆట‌గాడిని సూప‌ర్ ఓవ‌ర్‌లో పంప‌డం పై ల‌క్నో కోచ్ షాకింగ్ కామెంట్స్‌..

ఇక ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ విఫ‌లం అయ్యాడు. 15 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.