Sanju Samson : సంజూ శాంసన్ భావోద్వేగం.. అంత తేలికగా రాలేదు.. పతకాన్ని మెడలో వేసుకోగానే..
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలవడం పై సంజూ శాంసన్ (Sanju Samson) ఎమోషనల్ అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 4, 2026 / 03:04 PM IST
Sanju Samson Explosive Remark On India Asian Games 2026 Gold
Sanju Samson : ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి మరీ భారత జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రీడల్లో పతకం తేలికగా రాలేదని, అనుభవజ్ఞులైన అగ్రశ్రేణి ఆటగాళ్లను బరిలోకి దింపడం వల్లే ఉత్కంఠభరిత ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేయగలిగామని టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ వెల్లడించాడు.
మా జట్టులో చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఆ అనుభవవే విజేతగా నిలిపింది. వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనప్పుడు మా శక్తిని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ కావాలి. ఏకాగ్రతగా ఎలా ఉండాలో మాకు తెలుసు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. దీంతో స్వర్ణం నెగ్గగలిగాం. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్‌కు ఇదొ గొప్ప మ్యాచ్ అని సంజూ శాంసన్ తెలిపాడు.
ఫైనల్ ఏకపక్షంగా సాగలేదని సంజూ శాంసన్ తెలిపాడు. తొలుత తాము 200+ పరుగులు చేసినప్పుడు ఈజీగా మ్యాచ్ గెలుస్తామని అనిపించిందన్నాడు. అయితే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో పాక్ ఆటగాళ్లు కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశారన్నాడు.
దీంతొ గొప్ప మ్యాచ్‌గా నిలిచిందన్నాడు. అందుకనే ఈ గోల్డ్ మెడల్ అంత ఈజీగా రాలేదని, దీని కోసం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. స్వర్ణ పతకం గెలవడం ఎంతో సంతృప్తి నిచ్చిందని తెలిపాడు. స్వర్ణ పతకాన్ని మెడలో వేసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందని, ఇది మరిచిపోలేని అనుభూతి అని సంజూ చెప్పాడు.
