Sanju Samson surpasses MS Dhoni in major six-hitting record in T20S
Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా ఒమన్‌తో మ్యాచ్‌లో తొలి సిక్సర్ కొట్టడం ద్వారా శాంసన్ (Sanju Samson) ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో శాంసన్ 45 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని అధిగమించి టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
Arshdeep Singh : చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ధోని 405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు కొట్టాడు. శాంసన్ 307 మ్యాచ్‌ల్లో 353 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 463 మ్యాచ్‌ల్లో 547 సిక్సర్లు కొట్టాడు. ఆ తరువా కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు ఉన్నారు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 463 మ్యాచ్‌ల్లో 547 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 414 మ్యాచ్‌ల్లో 435 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 328 మ్యాచ్‌ల్లో 382 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 307 మ్యాచ్‌ల్లో 353 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సంజూశాంసన్‌తో పాటు అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38 పరుగులు), తిలక్ వర్మ (18 బంతుల్లో 29 పరుగులు) రాణించాడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, ఆమిర్ కలీమ్, జితేన్ రామనంది లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆతరువాత 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీమ్ (46 బంతుల్లో 64 పరుగులు), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51 పరుగులు), కెప్టెన్ జతిందర్ (33 బంతుల్లో 32 పరుగులు) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.