Mohammad Nabi : మీరు ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు కొట్టిన బౌల‌ర్ తండ్రి చ‌నిపోయాడు అని చెప్ప‌గానే.. న‌బీ రియాక్ష‌న్ ఏంటంటే..?

తాను ఐదు సిక్స‌ర్లు కొట్టిన బౌల‌ర్ తండ్రి చ‌నిపోయాడు అని చెప్ప‌గానే అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ (Mohammad Nabi) షాక్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Mohammad Nabi : మీరు ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు కొట్టిన బౌల‌ర్ తండ్రి చ‌నిపోయాడు అని చెప్ప‌గానే.. న‌బీ రియాక్ష‌న్ ఏంటంటే..?

Mohammad Nabi Stunned On Being Told Father Of Dunith Wellalage dead

Updated On : September 19, 2025 / 11:17 AM IST

Mohammad Nabi : ఆసియాక‌ప్ 2025లో అఫ్గానిస్తాన్ ప్ర‌యాణం ముగిసింది. సూప‌ర్ 4కి చేరుకోవాలంటే త‌ప్ప‌క‌గెల‌వాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ (Mohammad Nabi)మెరుపులు మెరిపించాడు. కేవ‌లం 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 60 ప‌రుగులు చేశాడు. ముఖ్యంగా లంక స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే వేసిన ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో తొలి ఐదు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచి జ‌ట్టుకు పోరాడే స్కోరును అందించాడు.

విషాదం..

అయితే.. ఈ మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే చ‌నిపోయాడు. ఈ విష‌యం ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలోనే శ్రీలంక జ‌ట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిసింది. అయిన‌ప్ప‌టికి తండ్రి మృతి చెందిన విష‌యాన్ని వారు స్పిన్న‌ర్‌కు తెలియ‌నివ్వ‌లేదు. మ్యాచ్ ముగిసిన త‌రువాత హెడ్‌కోచ్ స‌నత్ జ‌య‌సూర్య ఈ విష‌యాన్ని స్వ‌యంగా దునిత్ వెల్లలాగేకే చెప్పాడు.

Dunith Wellalage : ఇలాంటి బాధ ఏ ఆట‌గాడికీ రాకూడ‌దు.. మ్యాచ్ గెలిచామ‌నే ఆనందంలో ఉండ‌గానే.. కోచ్ వ‌చ్చి షాకింగ్ విషయం..

22 ఏళ్ల స్పిన్న‌ర్ దుఖఃసాగ‌రంలో మునిగిపోగా అత‌డిని కోచ్ జ‌య‌సూర్య ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌హ్మ‌ద్ న‌బీ ఈ విష‌యం చెప్ప‌గానే..

కాగా.. ఈ మ్యాచ్‌లో దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో వ‌రుస‌గా ఐదు సిక్స‌ర్లు బాదిన మ‌హ్మ‌ద్ న‌బీకి ఈ విష‌యాన్ని విలేక‌రులు తెలియ‌జేశారు. దునిత్ తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణించాడ‌ని చెప్పారు. ఈ విష‌యం విన్న నబీ షాక్ అయ్యాడు.

Mohammad Nabi : న‌బీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌.. వ‌రుస‌గా 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్‌..వీడియో

ఆ త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా దునిత్ వెల్లలాగేకు ధైర్యం చెప్పాడు. దునిత్ తో పాటు అత‌డి కుటుంబానికి హృద‌య‌పూర్వ‌క సానుభూతిని తెలియ‌జేశాడు.