Korea Open 2023 : కొరియా ఓపెన్‌లో సంచలనం.. సాత్విక్-చిరాగ్ జోడిదే టైటిల్
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి కొరియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచింది.
- Thota Vamshi Kumar
- Published On : July 23, 2023 / 03:06 PM IST
Satwik-Chirag
Korea Open : కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి కొరియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచింది. దక్షిణ కొరియాలోని యోసులోని జిన్నామ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్ఫియాన్, రియాన్ ఆర్డియాంటో జోడీ పై 17-21, 21-13, 21-14 తేడాతో గెలుపొందింది. గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.
IND-W Vs BAN-W : ఒత్తిడిలో భారత్ చిత్తు.. 9 పరుగులకే 4 వికెట్లు.. మూడో వన్డే టై.. సిరీస్ సమం
ఫైనల్ మ్యాచ్లో తొలి గేమ్‌ను భారత జోడి 17-21తో ఓడిపోయింది. అయితే.. రెండో గేమ్‌లో అద్భుతం పుంజుకుంది. ప్రత్యర్థి సర్వీసులను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్ చేజారకుండా కాపాడుకుంది. ఇక అత్యంత కీలకమైన మూడో గేమ్‌లోనూ అదరగొట్టింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది. తద్వారా 33,180 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు.
????????? ??
Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title ?
?: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS
— BAI Media (@BAI_Media) July 23, 2023
ఈ సంవత్సరంలో సాత్విక్–చిరాగ్ జోడి మూడు బీడబ్ల్యూటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్‌ను సాధించింది. స్విస్ ఓపెన్ 2023, ఇండోనేషియా ఓపెన్ 2023, తాజాగా కొరియా ఓపెన్ 2023ని కైవసం చేసుకుంది.
