Six Pack Girl: వయస్సు ఏడేళ్లు… సిక్స్ ప్యాక్ బాడీతో కుర్రకారుకే సవాల్
ఇక వివరాల్లోకి వెళితే రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కు చెందిన పూజ విష్ణోయ్ వయస్సు 7సంవత్సరాలు. చిన్న నాటి నుండే క్రికెట్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అథ్లెట్ శ్రావణ్ తన మామ కావటం, ఆయన ప్రోత్స
- Guntupalli Ramakrishna
- Published On : September 2, 2021 / 12:35 PM IST
Sixpack (1)
Six Pack : ఇటీవలికాలంలో సిక్స్ ప్యాక్స్ బాడీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆరుపలకల దేహం కోసం హాలీవుడ్ లో చాలా మంది హీరోలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంతో కష్టపడి ఆరుపలకల దేహాన్నిసాధించినవారు ఉన్నారు. అయితే తాజాగా ఓ ఏడేళ్ళ బాలిక ఆరుపలకల దేహంతో తానెవ్వరికీ తీసిపోనని నిరూపిస్తోంది. పట్టుదల, కృషితో ఆమె సాధించిన సిక్స్ ఫ్యాక్ బాడీని చూసి అంతా ఆశ్ఛర్యపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కు చెందిన పూజ విష్ణోయ్ వయస్సు 7సంవత్సరాలు. చిన్న నాటి నుండే క్రికెట్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అథ్లెట్ శ్రావణ్ తన మామ కావటం, ఆయన ప్రోత్సాహంతో ఐదేళ్ళ వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఫౌస్ట్ బౌలర్ గా ఆమె ప్రతిభను గుర్తించిన విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ప్రోత్సహించింది. పౌండేషన్ శిక్షణలో చోటుదక్కించుకుంది. చిన్నవయస్సులో కఠినతరమైన కసరత్తులు చేస్తుంది. డైటింగ్ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఏడేళ్ళ వయస్సులోనే ఆరుపలకల సిక్స్ ప్యాక్ బాడీని సాధించింది.
2024లో జరగబోయే యూత్ ఒలింపిక్స్ లో భారత దేశం తరుపున పాల్గొని పలకం సాధించాలన్న ధృడసంకల్పంతో ఉంది పూజ విష్ణోయ్. ఇప్పటికే 2019లో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్ లో 100 మీటర్ల విభాగంలో పూజ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఎంస్ ధోని తోపాటు, పలువురు బాలీవుడ్ నటులతో కలసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. ప్రతిరోజు తెల్లవారు జాము 3గంటలకు నిద్రలేని వ్యాయామం ప్రారంభిస్తుంది. అతరువాత ఆన్ లైన్ క్లాసులుకు హాజరువుతుంది. తర్వాత మళ్ళీ వ్యాయమం చేస్తూ ఇలా దిన చర్యను కొనసాగిస్తుంది పూజా విష్ణోయ్.
