Shaheen Afridi : 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. ఓ పాకిస్థాన్ బౌలర్ చెత్త రికార్డు ఇదే..
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్‌గా అతడు రికార్డులకు ఎక్కాడు.
- Thota Vamshi Kumar
- Updated on- November 4, 2023 / 03:48 PM IST
Shaheen Afridi
Shaheen Afridi unwanted record : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్‌గా అతడు రికార్డులకు ఎక్కాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన షాహీన్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 90 పరుగులు ఇచ్చాడు. ఇక ఇదే మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ ఓ వికెట్ పడగొట్టి 85 పరుగులు ఇచ్చి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ చెత్త రికార్డు హసన్ అలీ పేరిట ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచులో హసన్ అలీ వికెట్ తీసి 84 పరుగులు ఇచ్చాడు. తాజాగా ఈ మ్యాచులో.. హసన్ అలీ రికార్డును మొదటగా హరీస్ రవూఫ్ బ్రేక్ చేయగా ఆఖరి ఓవర్‌ను వేసిన షాహీన్ అఫ్రీది 12 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్లు..
షాహీన్ అఫ్రిది – 0/90 – న్యూజిలాండ్ పై బెంగళూరు (ఈరోజు మ్యాచ్‌లో)
హరీస్ రవూఫ్ – 1/85 – న్యూజిలాండ్ పై బెంగళూరు (ఈరోజు మ్యాచ్‌లో)
హసన్ అలీ – 1/84 – భారత్ పై మాంచెస్టర్ 2019
హారిస్ రవూఫ్ – 3/83 – ఆస్ట్రేలియా పై బెంగళూరు 2023
Kane Williamson : వచ్చాడు.. ఒక్క మ్యాచులో రెండు రికార్డులు.. కేన్ మామతో మామూలుగా ఉండదు
కాగా.. గత 24 వన్డేల్లో ఒక్కసారి కూడా వికెట్ తీయకపోవడం షాహీన్ ఆఫ్రిదికి ఇదే తొలిసారి
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీ (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్)శతకంతో చెలరేగాడు. కేన్ విలియమ్సన్ 95, గ్లెన్ ఫిలిప్స్ 41, మార్క్ చాప్మన్ 39, డారిల్ మిచెల్ 29 పరుగులతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ మూడు వికెట్లు తీశాడు. హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Rachin Ravindra Record: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలతో కొత్త రికార్డ్
