Rachin Ravindra Record: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలతో కొత్త రికార్డ్

వన్డే ప్రపంచకప్ లో మూడు సెంచరీలతో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Rachin Ravindra Record: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలతో కొత్త రికార్డ్

Rachin Ravindra Record

Rachin Ravindra World Cup Century: వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. తాను ఆడుతున్న ఫస్ట్ వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలు చేసి రికార్డుకెక్కాడు. మొదటి ప్రపంచకప్ ఆడుతూ ఒక ఆటగాడు మూడు సెంచరీలు చేయడంతో వరల్డ్ కప్ లో హిస్టరీలో ఇదే మొదటిసారి. బెంగళూరులో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో రచిన్ రవీంద్ర తాజాగా సెంచరీ బాదాడు. 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ తో 108 పరుగులు చేశాడు. అంతకుముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లోనూ సెంచరీలు బాదాడు.

24 ఏళ్లలోపు ODI ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా సాధించాడు. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డునూ దక్కించుకున్నాడు. అరంగేట్రం ప్రపంచకప్‌లో 500 ప్లస్ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్ని ముగిసేలోపు ఇంకెన్ని రికార్డులు లిఖిస్తాడో చూడాలి.

న్యూజిలాండ్ తరఫున ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీరే
3 – 2023లో రచిన్ రవీంద్ర
2 – 1975లో గ్లెన్ టర్నర్
2 – 2015లో మార్టిన్ గప్టిల్
2 – 2019లో కేన్ విలియమ్సన్

ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసింది వీరే
578 – విలియమ్సన్ (2019)
547 – గప్టిల్ (2015)
523 – రవీంద్ర (2023)
499 – స్టైరిస్ (2007)
456 – మార్టిన్ క్రోవ్ (1992)

Also Read: సత్తా చాటిన కివీస్ ఓపెనర్.. రచిన్ రవీంద్ర ఖాతాలో మరో ఘనత