డ్రెస్సింగ్ రూమ్‌లో కొట్టుకున్న పాక్‌ ఆట‌గాళ్లు ? కెప్టెన్ మ‌సూద్ వ‌ర్సెస్ అఫ్రిది.. మ‌ధ్య‌లో వెళ్లిన రిజ్వాన్‌కు దెబ్బ‌లు!

పాకిస్తాన్ జ‌ట్టులోని ఆట‌గాళ్ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Shan Masood And Shaheen Afridi Involved In Heated Physical Altercation

Shan Masood vs Shaheen Afridi : పాకిస్తాన్ జ‌ట్టులోని ఆట‌గాళ్ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌న్డే, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఆ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌ని మాజీ ఆట‌గాళ్లు ఓ పక్క విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఇక బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ ఓట‌మి అనంత‌రం ఆ జ‌ట్టులోని స్టార్ ఆట‌గాళ్లు కొట్టుకున్నార‌ట‌, ఆప‌బోయిన కీప‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ కు సైతం దెబ్బ‌లు గ‌ట్టిగానే త‌గిలిన‌ట్లుగా తెలుస్తోంది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావ‌ల్పిండి వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్ పై బంగ్లాదేశ్ గెల‌వ‌డం ఇదే తొలిసారి. ప‌ది వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయింది.

Novak Djokovic : యూఎస్ ఓపెన్‌లో పెను సంచ‌ల‌నం.. 18 ఏళ్ల‌లో జ‌కోవిచ్ తొలి సారి ఇలా..

ఈ మ్యాచ్‌లో పాక్ ఓట‌మి అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ కెప్టెన్ షాన్ మసూద్‌, స్టార్ పేస‌ర్ షాహిన్‌ షా ఆఫ్రిది ఇద్ద‌రూ డ్రెస్సింగ్స్ రూమ్‌లో కొట్టుకున్నార‌ట‌. దీన్ని ఆప‌డానికి వికెట్ కీప‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ప్ర‌య‌త్నించాడ‌ట‌. ఈ క్ర‌మంలో అత‌డికి కూడా దెబ్బ‌లు త‌గిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ ఘ‌ట‌న జ‌ర‌గడానికి కొద్ది సేప‌టికి ముందు మైదానంలో వీరిద్ద‌రికి సంబంధించిన ఓ వీడియో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ్రౌండ్‌లో భుజం పై షాన్ మ‌సూద్ చేయి వేయ‌గా.. దాన్ని అఫ్రిది కోపంగా తీసేశాడు. ఈ క్ర‌మంలోనే రెండో టెస్టు మ్యాచ్‌లో షాహీద్ అఫ్రిది పై వేటు ప‌డిన‌ట్లు స‌మాచారం.

Rahul Dravid : భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు ఎంపికైన రాహుల్ ద్ర‌విడ్ కొడుకు.. ఆనందంలో మాజీ కోచ్‌

జ‌ట్టు కూర్పు కోసం షాహీన్ అఫ్రిదిని త‌ప్పిస్తున్న‌ట్లు కోచ్ జాస‌న్ గిలెస్పీ పేర్కొన్న‌ప్ప‌టికీ కూడా కెప్టెన్‌ షాన్‌ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూం వాతావరణం దెబ్బతీసినందుకే అత‌డిపై వేటు ప‌డిన‌ట్లు ఆ దేశ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు