Rahul Dravid : భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. ఆనందంలో మాజీ కోచ్
టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపిక అయ్యాడు.

Rahul Dravids son Samit Dravid drafted into India under-19 squad
Rahul Dravids son Samit Dravid : టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపిక అయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు సంబంధించిన జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. టెస్టు, వన్డే టీమ్‌లలోనూ సమిత్‌కు చోటు దక్కింది. సెప్టెంబర్ 21 నుంచి ఆసీస్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, రెండు.. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.
వన్డే సిరీస్‌కు పుదుర్చేరి, టెస్టులకు చెన్నై వేదికలు కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమాన్ వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. టెస్టు జట్టుకు మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్థన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా.. సమిత్ ద్రవిడ్ ఆల్‌రౌండర్ అన్న సంగతి తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఫాస్ట్ బౌలర్.
IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని షాక్.. ఇక ఇప్పట్లో..
టీమ్ఇండియాలో చోటే లక్ష్యంగా సమిత్ ద్రవిడ్ తన అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో అండర్-19 జట్టుకు ఎంపిక కావడం తొలి అడుగుగా చెప్పవచ్చు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తే మాత్రం భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు అతడికి అవకాశాలు మెరుగు అవుతాయి. సీనియర్ ఆటగాళ్లు రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమిత్ నిలకడగా రాణిస్తే మాత్రం తొందర్లోనే అతడిని భారత జట్టులో చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అండర్-19 జట్టుకు సమిత్ ద్రవిడ్ ఎంపిక కావడంతో ఈ విషయం తెలిసిన ద్రవిడ్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత అండర్-19 జట్టు:
మహ్మద్ అమాన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాఖ్, కార్తికేయ, కిరణ్ చోర్మలే , అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ , నిఖిల్ కుమార్ , చేతన్ శర్మ , హార్దిక్ రాజ్ , రోహిత్ రాజావత్ , మహ్మద్ ఈనాన్
Ravichandran Ashwin : అశ్విన్ భయ్యా.. ఇలా చేశావేంటి..? నీ బౌలింగ్‌లో షాట్లు కొట్టారనేనా?
ఆస్ట్రేలియా నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత అండర్ 19 జట్టు:
వైభవ్ సూర్యవంశీ, నిత్య పాండ్య, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), కార్తికేయ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), చేతన్ శర్మ, సమర్థ్ , ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్ (PCA), ఆదిత్య సింగ్, మహ్మద్ ఈనాన్.
🚨 NEWS 🚨
India U19 squad and fixtures announced for multi-format home series against Australia U19.
Squad for one-day series: Rudra Patel (VC) (GCA), Sahil Parakh (MAHCA), Kartikeya KP (KSCA), Mohd Amaan (C) (UPCA), Kiran Chormale (MAHCA), Abhigyan Kundu (WK) (MCA), Harvansh…
— BCCI (@BCCI) August 31, 2024