IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని షాక్.. ఇక ఇప్పట్లో..
పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు తిరుగులేదు.

Big Blow To India Suryakumar Yadav Suffers Hand Injury Ahead Of Bangladesh Test
IND vs BAN : పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు తిరుగులేదు. అయితే.. టెస్టుల్లో మాత్రం అతడి స్థానం ప్రశ్నార్థకమే. సుదీర్ఘ పార్మాట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో రాణించడంతో పాటు దులీప్ ట్రోఫీలో రాణించి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోవాలని సూర్య భావించాడు. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరుపున బరిలోకి దిగిన అతడికి ఊహించని షాక్ తగిలింది. తమిళనాడుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు.
ఫీల్డింగ్ సమయంలో సూర్య గాయపడినట్లుగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్‌ఫో తెలిపింది. దులీప్ ట్రోఫీలో సూర్య పాల్గొనడంపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొంది. అంతేకాకుండా.. అతను బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతడు ఆడడం అనుమానంగానే మారినట్లు వెల్లడించింది.
Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా
ఫిబ్రవరి 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యాడు. ఆ తరువాత అతడికి మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కలేదు.
స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు టోర్నమెంట్‌లో బరిలోకి దిగాడు. తమిళనాడుతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం ఫీల్డింగ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రమైతే మాత్రం టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న అతడి ఆశ ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.
IND vs NZ : భారత్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..