Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా

టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవనీ లేఖరా బంగారు పతకాన్ని సాధించింది.

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా

Avani Lekhara

పారాలింపిక్స్‌లో భారత పారా షూటర్‌ అవనీ లేఖరా స్వర్ణ పతకం సాధించింది. ఇవాళ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్1) విభాగంలో ఆమె ఈ మెడల్ దక్కించుకుంది. దీంతో ఆమె వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించినట్లయింది. 2020లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవనీ లేఖరా బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పుడూ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

అప్పట్లో 249.6 పాయింట్లతో పతకం సాధిస్తే.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొడుతూ 249.7తో మెరుగుపరుచుకుంది. అవనీ లేఖరాకు 2012లో కారు ప్రమాదం కారణంగా వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో పక్షవాతం వచ్చి వీల్ చైర్‌కే పరిమితం అయినప్పటికీ క్రీడల్లో రాణిస్తోంది.

మరోవైపు, ఇవాళ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్1) విభాగంలో భారత పారా షూటర్ మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేకపోయారన్న విషయం తెలిసిందే. పారాలింపిక్స్‌లో మాత్రం గోల్డ్ మెడల్ దక్కింది. భారత్‌లోని అత్యుత్తమ పారాలింపియన్స్‌లో ఒకరిగా అవనీ కొనసాగుతోంది.

Also Read: సూర్య క్యాచ్‌పై మళ్లీ చెలరేగిన వివాదం.. సౌతాఫ్రికా స్పిన్నర్ వీడియో వైరల్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు..