IND vs NZ : భారత్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

New Zealand appoints Jacob Oram as bowling coach
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్న బౌలింగ్ కోచ్ పదవిని భర్తీ చేసింది. కివీస్ మాజీ ఆల్‌రౌండర్ జాకబ్ ఓరమ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అక్టోబర్ 7 నుంచి అతడు తన బాధ్యతలు అందుకోనున్నట్లు తెలిపింది.
జాకబ్ ఓరమ్ న్యూజిలాండ్ తరుపున 33 టెస్టులు, 160 వన్డేలు, 36 టీ20 మ్యాచులు ఆడాడు. 33 టెస్టుల్లో 1780 పరుగులు, 60 వికెట్లు తీశాడు. 160 వన్డేల్లో 2434 పరుగులు, 93 వికెట్లు పడగొట్టాడు. 36 టీ20 మ్యాచుల్లో 474 పరుగులు 19 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత 2018 నుంచి 2022 వరకు న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ప్రాంఛైజీ క్రికెట్‌లోనూ పలు టీమ్‌లకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు.
Ravichandran Ashwin : అశ్విన్ భయ్యా.. ఇలా చేశావేంటి..? నీ బౌలింగ్‌లో షాట్లు కొట్టారనేనా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా అక్టోబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తోనే ఓరమ్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు.
భారత్-న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – అక్టోబర్ 16 నుంచి 20 వరకు – బెంగళూరు
రెండో టెస్టు – అక్టోబర్ 24 నుంచి 28 వరకు – పూణె
మూడో టెస్టు – నవంబర్ 1 నుంచి 5 వరకు – ముంబై
ENG vs SL : శ్రీలంక రెండు, ఇంగ్లాండ్ ఒకటి.. గెలుపు ఎవరిది..?
The former BLACKCAPS and Central Stags allrounder takes over the role vacated by Shane Jurgensen in November 🏏 #CricketNationhttps://t.co/NXhFcOa2cR
— BLACKCAPS (@BLACKCAPS) August 28, 2024